Sunday, November 24, 2024

YCP vs TDP – గుడివాడ‌లో హైటెన్ష‌న్ – టిడిపి, జ‌న‌సేన నేత‌ల‌ను అడ్డుకున్న పోలీసులు

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్దకు వెళ్తున్న టిడిపి-జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులు.. టిడిపి -జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల తీరుపై గుడివాడ తెదేపా ఇన్‌చార్జ్‌ వెనిగండ్ల రాము, సీనియర్‌ నేత రావి వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి కొడాలి నానికి అనుమతి ఇచ్చి.. తమను ఎందుకు అడ్డుకుంటున్నారని టిడిపి-జనసేన నేతలు పోలీసులను నిలదీశారు. ఆ వైఖరిని నిరసిస్తూ వెనిగండ్ల రాము రోడ్డుపై బైఠాయించారు. మెయిన్ రోడ్డులో టిడిపి జనసేన ,వైసిపి శ్రేణులకు మధ్య పరస్పర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు తీసుకోవడంతో పలువురు నాయకులు కింద పడిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్‌కు నివాళులర్పించి తీరుతామని తేల్చిచెప్పారు. ఎన్నికల కోసం కొడాలి నాని పన్నే కుయుక్తులను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.

”ఎన్టీఆర్ కుటుంబ సభ్యులనే తిట్టిన కొడాలి నానికి ఆయన పేరు తలచే అర్హత కూడా లేదు. యూట్యూబ్‌లో వ్యూస్ కోసం పాకులాడే వ్యక్తిగా నాని మారారు. గుడివాడలో వైకాపా పనైపోయింది. సాయంత్రం నిర్వహించే ‘రా.. కదలి రా’ సభకు పోలీసులు అడ్డంకులు సృష్టించడం తగదు. ఈ ప్రభుత్వం మరో రెండు నెలలు మాత్రమే ఉంటుందని గుర్తించి పోలీసులు పనిచేయాలి. ఎవరెన్ని కుట్రలు పన్నినా సభను విజయవంతం చేసి తీరుతాం” అని రాము చెప్పారు.

అనంతరం తెదేపా-జనసేన నేతలు బారికేడ్లను తోసుకుంటూ ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు వెళ్లారు. ర్యాలీగా పెద్ద సంఖ్య‌లో టిడిపి నేత‌లు, కార్య‌కర్త‌లు అక్క‌డికి చేరుకున్నారు. అనంత‌రం ఎన్టీఆర్ విగ్రహానికి వెనిగండ్ల రాము, నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement