Friday, November 22, 2024

YCP Super Survey – బ‌ల‌మైన అభ్య‌ర్ధుల కోసం జ‌గ‌న్ అన్వేష‌ణ‌..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడేకొద్దీ అధికార వైసీపీ తమ వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో గెలు పొందడమే లక్ష్యంగా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పావులు కదుపుతున్నారు. అందుకోసం ఆయన వివిధ రకాల సర్వేలు చేయిస్తున్నారు. ఇప్పటికే ఇంటెలిజెన్స్‌తో పాటు ఐప్యాక్‌, సొంత సర్వే, పార్టీ పరమైన సర్వేలు చేయిస్తున్నారు. ఆ దిశగా ఆ నివేదికల ఆధారంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. అయితే ఎన్నికలలోపు పార్టీని పూర్తి స్థాయిలో మరింత బలోపేతం చేయాలన్న ఆలోచనతో సూపర్‌ సర్వే వైపు మొగ్గు చూపుతు న్నట్లు తెలుస్తోంది. అందుకోసం తిరుపతి కేంద్రం గా సూపర్‌ సర్వే బృందం సొంత కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయబోతోంది. 26 జిల్లాలకు సర్వే కో – ఆర్డినేటర్లను నియమించి ఆ టీమ్‌ తమ కార్యకలాపాలను వేగవంతం చేయబోతోంది. ఆగస్టు చివరి నాటికి సూపర్‌ సర్వేను పూర్తిచేసి సీఎం జగన్‌కు సమగ్ర నివేదికను ఇవ్వను న్నట్లు సమాచారం.

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో

ఇప్పటివరకు ఐ ప్యాక్‌ ఎప్పటికప్పుడు నియోజక వర్గాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇంఛార్జ్‌ల పనితీరు ప్రజల్లో వాళ్ల మైలేజ్‌ తదితర అంశాలపై సర్వే జరిపి రిపోర్ట్‌ను సీఎం జగన్‌కు సమర్పిస్తున్నారు. వాటి ఆధారంగానే ఆయన గడపకు గడపకు మన ప్రభుత్వం వర్క్‌షాపులో సమీక్ష జరిపి వెనుకబడిన ఎమ్మెల్యేలకు గ్రాఫ్‌ పెంచు కోవాలని సూచిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు ఎమ్మెల్యేల పనితీరును కూడా చాలా వరకు మెరుగుపరుచుకున్నారు. ప్రజల్లో కూడా గ్రాఫ్‌ను పెంచు కున్నారు. అయితే ఐప్యాక్‌తో పాటు ఇంటెలిజెన్సీ వర్గాలి చ్చే నివేదికలు వ్యక్తిగతంగా ప్రత్యేక బృందాలు రూపొం దించిన సర్వే రిపోర్ట్‌లతో పాటు పార్టీ పరమైన రిపోర్ట్‌ను కూడా సీఎం జగన్‌ లోతుగా పరిశీలిస్తూ ఆ దిశగానే అవస రమైన నియోజకవర్గాలపై ఫోకస్‌ పెంచుతూ వస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆ నాలుగు రకాల సర్వేపై కొంతమందిలో రకరకాల అపోహలు రావడం కొంత మంది ఐప్యాక్‌ బృందం ఎమ్మె ల్యేలకు అనుకూలంగా రిపోర్ట్‌లు ఇస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతూ వస్తోంది. దీంతో గతంలో వచ్చిన ఆ నాలుగు రకాల సర్వేలను పరిశీలిస్తూ ఆ తరహా రిపోర్ట్‌లు ఏమైనా ఉన్నా యా అనే కోణంలో సర్వే జరుపుతూ సూపర్‌ సర్వే నివేది కలను అందజేసే దిశగా ఆ బృందం రంగంలోకి దిగింది.

తిరుపతి కేంద్రంగా తమ కార్యకలాపాలను ప్రారంభిం చబోతున్న సూపర్‌ సర్వే బృందం ఆగస్టు చివరి నాటికి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యే లు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల పనితీరుపై సమగ్ర నివేదిక సమర్పించనుంది. అందుకోసం ప్రతి జిల్లాకు ఒక సర్వే కో – ఆర్డినేటర్‌ను నియమించారు. వారి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గానికి 20 నుంచి 22 మంది సర్వే టీమ్‌ ఆయా మండలాల పరిధిలో సర్వేని చేపట్టనుంది. అందుకోసం ప్రత్యేకంగా జిల్లా కో – ఆర్డినేటర్‌తో పాటు నియోజకవర్గ ఇంఛార్జ్‌ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. కమిటీ సభ్యులు మండలానికి నలుగురు వంతున ఆయా ప్రాంతాల్లో అన్ని వర్గాలకు చెందిన ప్రజలను కలిసి స్థానిక ఎమ్మెల్యే పనితీరుపై ఆరా తీయనున్నారు. ప్రస్తుతం ఐప్యాక్‌ కూడా అదే తరహాలో తమ కార్యకలాపాలను కొనసాగిస్తోంది. అయితే సూపర్‌ సర్వే టీమ్‌ ఎమ్మెల్యేల పనితీరుతో పాటు గతంలో ఆయా సంస్థలు రూపొందిం చిన సర్వే రిపోర్ట్‌ను కూడా పరిశీలించనుంది. ఆగస్టు చివరి నాటికి తమ సర్వేను పూర్తి చేసి వాస్తవ నివేదికలను సీఎం జగన్‌కు సమర్పించనున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల సమయం దగ్గర పడేకొద్దీ రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ తమతమ పార్టీ పరమైన కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. వివిధ రకాల కార్యక్రమాల పేరుతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌ వంటి పార్టీలు నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నాయి. అధికార వైసీపీ అయితే గత ఏడాది మే 11వ తేదీ నుంచి గడపకు గడపకు మన ప్ర భుత్వం పేరుతో నెలలో 22 రోజులకు పైగా ప్రజ ల్లోనే ఉండేలా తమ ప్రణాళికలను రూపొందించు కున్న విషయం తెలిసిందే. తాజాగా జగనన్న సురక్ష కార్యక్రమం పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌ లంతా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. సీఎం జగన్‌ కూడా 175 నియోజకవర్గాలపై ఫోకస్‌ పెట్టారు. ముఖ్యంగా వెనుకబడిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించా రు. ఆయా నియోజకవర్గాల్లో వెనుకబడిన ఎమ్మెల్యేలు కూడా గెలిచేలా వారి గ్రాఫ్‌ మరింత పెరిగేలా ఆ ప్రాంతా ల్లో కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తూ వస్తున్నా రు. దీన్ని బట్టి చూస్తుంటే సీఎం జగన్‌ వెనుబడిన నియోజకవర్గాలతో పాటు 175 నియోజకవర్గాలపై ఫోకస్‌ పెంచినట్లు స్పష్టమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement