Friday, November 22, 2024

KNL: వైసీపీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవాలి… తిక్కారెడ్డి

కర్నూలులో అక్రమంగా ప్రభుత్వ అనుమతిలేకుండా నిర్మించిన వై. యస్.ఆర్.సి. కార్యాలయాన్ని ప్రభుత్వం స్వాధీన పర్చుకోవాలని టీడీపీ అధ్యక్షులు తిక్కారెడ్డి కోరారు. శనివారం కర్నూల్ టీడీపీ కార్యాలయంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ.. కర్నూలు నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఆగ్రోఇండస్ట్రీస్ కార్పోరేషన్ స్థలాన్ని ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమించుకొని వై.యస్.ఆర్.సి.పి. కార్యాలయ నిర్మాణాన్ని చేపట్టి కోట్లాది రూపాయల విలువచేసే స్థలాన్ని లీజు గానీ, అప్రూవల్ లేకుండా నిర్మాణాలు చేపట్టడం సరి కాదన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన భవనాలను తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి టి.జి.భరత్, పత్తికొండ శాసనసభ్యులు కె.యి.శ్యామ్ కుమార్, కె.తుగ్గలి నాగేంద్రతో కలిసి విజ్ఞప్తి చేశారు.

కర్నూలు ప్యాలెస్ ను ఎలా కట్టావు జగన్.. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాల కాలంలో వేలాది కోట్ల ప్రజాధనాన్ని దోచేసి ఆ సోమ్ముతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పార్టీ కార్యాలయాల పేరుతో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయించి, ఎలాంటి ప్రభుత్వ అనుమతుల కూడా (అప్రూవల్) లేకుండా నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం కలిగించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు.

ఈ విషయమై శనివారం జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో నగర పార్టీ అధ్యక్షులు నాగరాజు యాదవ్, యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమిశెట్టి నవీన్, లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి యల్.వి.ప్రసాద్ లతో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఇప్పటికే రాష్ట్రంలోని విశాఖ రుషికొండలో నిర్మితమైనటువంటి ప్యాలెస్ లను తలదన్నేలా కర్నూలు నగరంలో వైసీపీ కార్యాలయ భవన నిర్మాణాన్ని చేపట్టారన్నారు. కేవలం అధికార మదంతో, రౌడీయిజంతో జగన్ అక్రమించుకున్నారు. జగన్ ఇచ్చిన ఆదేశాలను గుడ్డిగా నమ్మి వారికి అధికారులు ఎలా అనుమతులిచ్చారని ప్రశ్నించారు. ఇందులోని పూర్వపరాలను వెలికి తీసి, నిజాలు బయటపెట్టాలని, ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు లేఖ రాస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement