అమరావతి – గతంలో యాక్టివ్ పాలిటిక్స్ చేసిన కాపు ఉద్యమ నేత, ముద్రగడ పద్మ నాభం కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తనకు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని కూడా గతంలో ప్రకటించారు. అయితే కాపు జాతి కోసం తన తుది శ్వాస వరకూ పోరాడుతూనే ఉంటానని చెప్పారు. .
తాజాగా మారుతున్న సమీకరణాల తో ముద్రగడ పద్మనాభాన్ని యాక్టివ్ పాలిటిక్స్ లోకి తీసుకురావాలని జగన్ భావిస్తున్నారు. అందుకే ఇటీవల ఎంపీ మిథున్ రెడ్డి .. ముద్రగడను కలిసి తమ ప్రతిపాదనలను వివరించారు.
కాకినాడ ఎంపీ స్థానం లేదంటే ప్రత్తిపాడు, పెద్దాపురంలలో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా ఆఫర్ చేసారట. వీటిలో ముద్రగడ దేనిని ఎంచుకున్నా పర్లేదని చెప్తున్నారు. అలాగే మీ కుటుంబ సభ్యులలో ఒకరు పోటీ చేసినా కోరుకున్న చోట పోటీ చేసే అవకాశం కల్పిస్తామని జగన్ ఆఫర్ ఇచ్చారని టాక్. దీంతో ముద్రగడ తన కుమారుడు చల్ల రావు ను క్రియ శీల రాజ కీయలలోకి తీసుకు వచ్చే ఆలోచనలో పడ్డారని అయన అభిమానులు అంటున్నారు.
కాగా, తన వద్దకు జగన్ రాయబారిగా వచ్చిన మిథున్ తో తన కుటుంబ సభ్యులు, అనుచరులతో చర్చించి త్వరలోనే తుది నిర్ణయం చెబుతానని ముద్రగడ అన్నారని . వార్తలు వినిపిస్తున్నాయి.