Sunday, November 24, 2024

YCP – లావణ్యకు మంగళగిరి టికెట్ – నిరాశ లో గంజి చిరంజీవి

మంగళగిరి ప్రభ న్యూస్. – వైఎస్ఆర్సిపి మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి ఎంపిక విషయంలో అధిష్టానం రోజుకో నిర్ణయం తీసుకోవడం నాయకులను గందరగోళంలో పడేస్తోంది. శుక్రవారం సీఎంఓ కార్యాలయానికి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, కమల కుమార్తె హనుమంతరావు కోడలు లావణ్య, ఆమె భర్త సత్యం వెళ్లారు.. జగన్ తో వారంతా భేటీ అయ్యారు.మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థిగా ఆమె పేరును వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయం ప్రకటించింది. లావణ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పూల బొకే కూడా అందజేసి శుభాకాంక్షలు తెలిపారు…

చిరంజీవి శిబిరంలో నిరాశ!

*వైఎస్ఆర్సిపి లో ఇప్పటి వరకు ఆ పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జి గంజి చిరంజీవి నూతన ఉత్సాహాన్ని నింపుతూ వచ్చారు. అధిష్టానం ఆదేశాల మేరకు గుడ్ మార్నింగ్ మంగళగిరి కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. తొలి విడత జాబితాలో వైఎస్ఆర్సిపి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా గంజి చిరంజీవి పేరును ప్రకటించారు ఆయన సతీమణి గంజి రారా కాపు సామాజిక వర్గం కావడంతో పద్మశాలి వర్గం ఓట్లతో పాటు కాపు సామాజిక వర్గ ఓట్లు కూడా పార్టీకి రాబట్టుకోవచ్చునని అధిష్టానం భావించింది.

. ఆ తర్వాత అనూహ్యంగా మురుగుడు లావణ్య పేరు తెరపైకి వచ్చింది. ఆమె పేరును ఎమ్మెల్యే అభ్యర్థిగా మాత్రం ప్రకటించలేదు. అభ్యర్థి మార్పు వైఎస్సార్సీపీకి కలిసివస్తుందా ప్రతికూలంగా ఉంటుందా అన్నది చర్చనియాసంగా మారింది. ఇదేనా ఫైనల్ ప్రకటనా లేక చివర్లో వేరే అభ్యర్థిని నారా లోకేష్ కు దీటుగా తెరపైకి తెస్తారా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. తరచూ అభ్యర్థులను మార్చటం ప్రతిపక్ష టీడీపీకి కలిసొస్తుందని అంటున్నారు. .

Advertisement

తాజా వార్తలు

Advertisement