Monday, November 25, 2024

పరిపాలనా రాజధానికి రూ.1200 కోట్లు.. మాస్టర్‌ ప్లాన్‌ రెడీ!

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి మండిపడ్డారు. దివాళాకోరు బాబు చివరకు ఆనందయ్యను కూడా వదలడం లేదని దుయ్యబట్టారు. ఆనందయ్య మందును పరీక్షల కోసం ప్రభుత్వం పంపించిందని చెప్పారు. ఫలితాలు రాగానే మందు పంపిణీ మొదలవుతుందని వెల్లడించారు. డ్రగ్ మాఫియా కోసమే ఆనందయ్య మందును ఆపేశారంటూ శవాలపై పేలాలు ఏరుకునే బాబు గుడ్డ కాల్చి మీదేశారని విమర్శించారు. మాఫియాలన్నిటికీ బాసువి నువ్వే కదా బాబూ అని విజయసాయి వ్యాఖ్యానించారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో గర్భిణుల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని విజయసాయి అన్నారు. ప్రసవాల విషయంలో ప్రత్యేక చర్యలను చేపట్టిందని తెలిపారు. కరోనా సోకిన గర్భిణులకు ప్రత్యేక వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిందని చెప్పారు.

రాష్ట్ర పరిపాలనా రాజధాని విశాఖను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపారు. రూ. 1,200 కోట్లతో రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ ద్వారా పలు ఆకర్షణీయ ప్రాజెక్టులు ఏర్పాటు కాబోతున్నాయని వెల్లడించారు. ఒక ముఖ్యమంత్రి పదేళ్లలో చేయగలిగే పనులను జగన్ కేవలం రెండేళ్లలో అమలు చేశారని అన్నారు. 14 ఏళ్లు సీఎంగా వెలగబెట్టానని డబ్బా కొట్టుకునే చంద్రబాబు ఈ రెండేళ్లలో ప్రజలకు పనికొచ్చే ఒక్క సలహా అయినా ఇచ్చారా? స్టేలు, బెయిళ్లు సంపాదించడం మినహా అని విజయసాయి ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement