Friday, November 15, 2024

టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్… దగ్గర్లోనే పరీక్షా కేంద్రాలు!

ఏపీలో కరోనా నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ తో ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి భేటీ అయ్యారు. దూర ప్రాంతాల పదో తరగతి విద్యార్థులు స్థానికంగా పరీక్ష రాసేలా అనుమతి ఇవ్వాలని శ్రీకాంత్ రెడ్డి సీఎంను కోరారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు. పదో తరగతి విద్యార్థులు స్థానికంగా పరీక్ష రాసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. పిల్లల భవిష్యత్ దృష్ట్యా పరీక్షలు నిర్వహించాల్సి వస్తోందని సీఎం అన్నారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల పదో వతరగతి తరగతులు జరుగుచున్నాయని, అందుకే మన రాష్ట్రంలోనూ పరీక్షలు నిర్వహించాల్సి వస్తోందని సీఎం జగన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement