విజయవాడ – వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు, మాజీలు మాతో టచ్ లో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.. విజయవాడలో జరుగుతోన్న కాంగ్రెస్ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో పొలిటికల్ వేక్యూమ్ ఉందన్నారు.
2014 నుంచి రెండు ప్రభుత్వాలు ఏపీ హక్కులు, విభజన హామీల కోసం పని చేయలేదన్న ఆయన .. ప్రాంతీయ పార్టీలు పూర్తిగా ఫెయిల్ అయ్యాయి… ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా స్ధానం ఉందన్నారు. ఇప్పటికే, పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలవడంతో ఏపీ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు.. జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్‌లు సిద్ధం చేస్తున్నాం అన్నారు. ఈ నెల 21 మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలపై రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ , మల్లిఖార్జున ఖర్గే,ఆధ్వర్యంలో స్ట్రాటజీ సమావేశం జరుగుతుందని వెల్లడించారు. మేనిఫెస్టో, ఏపీసీసీ ఆశించే అంశాలు, ఏపీకి ఏం చేయాలనే అంశాలు స్ట్రాటజీ సమావేశంలో నిర్ణయిస్తారన్నారు.