Friday, November 22, 2024

YCP కి తూర్పులో మ‌రో షాక్…జ‌న‌సేన వైపు పిఠాపురం ఎమ్మెల్యే చూపు

పిఠాపురం : ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీలో ఎన్నికలకు ముందు తీవ్ర గందరగోళం నెలకొనేలా ఉంది. వైనాట్ 175 పేరుతో అన్ని స్థానాల్లోనూ గెలిచి తిరిగి అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సర్వేల ఆధారంగా గెలుపు అవకాశాలు లేని వారికి టికెట్ నిరాకరిస్తున్నారు. నియోజకవర్గాలు మారుస్తున్నారు. మ‌రికొంద‌ర్ని లోక్ సభకు పోటీ చేయమంటున్నారు. ఎంపిల‌కు అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వ‌నున్నారు. దీంతో వైసీపీ నేతల్లో బైటికి చెప్పలేని ఆందోళన మొదలయ్యింది. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో ఇంఛార్జులను మార్చి మార్పుపై ఎంత కఠినంగా ఉండబోతున్నారో చెప్పకనే చెప్పారు జగన్.

ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల‌లో తూర్పు గోదావ‌రి జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేల‌కు టికెట్స్ నో అని చెప్పేశారు.. అందులో పిఠాపురంలో పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొర‌బాబు కూడా ఉన్నారు.. దీంతో పార్టీ మార్పుపై పిఠాపురం ఎమ్మెల్యే పెండేం దొరబాబు తన అనుచరులకు హింట్లు ఇచ్చారు. వైసిపికి రాజీనామా చేయ‌నున్న‌ట్లు కూడా ఆయ‌న వెల్ల‌డించారు. అయితే తాను మ‌ళ్లీ పిఠాపురం నుంచే పోటీ చేస్తాన‌ని కూడా తేల్చి చెప్పారు..ఇక జనసేన నేతలతో పెండెం దొరబాబు టచ్ లోకి వెళ్లినట్లు స‌మాచారం.. జ‌న‌సేన కీల‌క నేత‌లతో జ‌రిపిన చ‌ర్చ‌లు విజ‌య‌వంతమైన‌ట్లు టాక్.. దీంతో ఆయ‌న జ‌న‌సేన‌లోకి వెళ్ల‌నున్న‌ట్లు ఆయ‌న అభిమానులు చెబుతున్నారు.. . ఇన్చార్జి మార్పు తరువాతే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశం ఉంది. ఆ త‌ర్వాత మంచి రోజు చూసుకుని ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌మ‌క్షంలో ఆయ‌న జ‌న‌సేన‌లో చేరనున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement