వైసీపీ నేతల ఆటవిక చర్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండి పడ్డారు. కాకినాడలో పూజారులపై దాడిని ఆయన ఖండించారు. అర్చకులను కాలితో తన్నడం, కొట్టడం హేయమైన చర్యన్నారు. ఇది వైసీపీ నేతల మదానికి నిదర్శనమన్నారు.
‘అర్చకుడు అంటే దేవుడు, భక్తుడికి మధ్య అనుసంధాన కర్తగా భావిస్తాం. వారి కాళ్లకు మొక్కే సాంప్రదాయం మనది. వారిపై దాడి చేయడం పై ఫైర్‌అయ్యారు. ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రశాంతంగా జీవనం సాగించలేని పరిస్థితి నెలకొందన్నారు.
“కాకినాడ శివాలయంలో పూజ సరిగా చేయలేదని గర్భగుడిలో అర్చకులపై వైకాపా నేత సిరియాలు చంద్రరావు దాడి చేశాడు. భగవంతుడి సేవ తప్ప మరో ధ్యాసలేని అర్చకులపైనా ప్రతాపమా? పూజారులపై దాడి చేసిన వైసీపీ నేతను తక్షణమే అరెస్టు చేయాలి. మరో రెండు నెలల్లో ప్రజా ప్రభుత్వం రాబోతోంది. ఈలోగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పోలీసులకు విన్నవిస్తున్నా” అని పేర్కొన్నారు.