గుడివాడ, జూలై 1 (ప్రభన్యూస్) : పెదపారుపూడి మండల గురువిందగుంట వైసీపీ నాయకుల వేధింపులు భరించలేక ఓఅంగన్వాడి టీచర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన గురువిందగుంట గ్రామంలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం గ్రామంలో 20 సంవత్సరాలుగా అంగన్వాడి టీచర్ గా పని చేస్తున్న అన్నపూర్ణను గ్రామంలోని రాజకీయ నాయకులు గత వారం రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం. తాము చెప్పినట్లు వినకపోతే ఉద్యోగం నుండి తొలగిస్తామని తమకు అనుకూలమైన వారిని అంగన్వాడి టీచర్ గా ఎంపిక చేస్తామని అంగన్వాడీలో వచ్చే పోషకాహారాలు గర్భిణీలు బాలింతలకు ఇవ్వటం లేదని అల్లరి చేస్తామంటూ బెదిరింపులకు దిగినట్లు సమాచారం.
వారి వేధింపులు భరించలేక సూసైడ్ నోట్ లో ముగ్గురు నాయకుల పేర్లు రాసి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. నా చావుకు ముగ్గురే కారణమని ఆ సూసైడ్ నోట్ లో రాసినట్లు సమాచారం. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్ గుడివాడ ఏరియా ప్రభుత్వ హాస్పటల్లో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు.