తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. విపక్షాలపై వైసిపి నేతలు విరుచుకుపడుతున్నారు. తిరుపతిలో తమ పార్టీ ది విజయం ఖాయమైందని వైసిపి నేత అంబటి రాంబాబు ఉన్నారు. ఇక వైసీపీకి ప్రత్యామ్నాయాన్ని తెలుసుకునేందుకు మాత్రమే తిరుపతి ఎన్నిక అని స్పష్టం చేశారు. తద్వారా ప్రథమస్థానం తమదేనని, తమ తర్వాత రెండో స్థానంలో నిలిచే పార్టీ ఏదన్న విషయం ఈ ఉప ఎన్నిక ద్వారా తెలుస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల బరిలో 28 మంది బరిలో మిగిలారు. ప్రధానంగా వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి, బీజేపీ అభ్యర్థి రత్నప్రభ, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ మధ్యే పోటీ ఉండనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement