వైసీపీ నేత గౌతంరెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అతనిపై నమోదైన హత్యాయత్నం కేసులో గౌతంరెడ్డికి సుప్రీం ధర్మాసనం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆయనకు సుప్రీంకోర్టు పలు షరతులను కూడా విధించింది. దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరించాలని, దర్యాప్తు అధికారి ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాజరు కావాలని న్యాయస్థానం షరతు విధించింది.
ఆధారాలను ధ్వంసం చేయడం, సాక్ష్యులను బెదిరించడం చేయకూడదని స్పష్టం చేసింది. ఇతర షరతులన్నీ దర్యాప్తు అధికారి నిర్ణయిస్తారని సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
- Advertisement -