Friday, November 22, 2024

త్వరగా తేల్చండి….ప్లీజ్…ప్లీజ్..

అమరావతి, ఆంధ్రప్రభ: పాలనా వికేంద్రీకరణలో భాగం గా మూడు రాజధానుల అంశాన్ని త్వరితగతిన విచారించా లని ప్రభుత్వం మరోసారి సుప్రీంను కోరనుంది. అమరావతి ఏకైక రాజధానిగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ ఇంకా విచారణకు రాలేదు. గత నెల్లో విచారణ జరగాల్సి ఉండగా ఫిబ్రవరి 14వ తేదీన సీజే జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ మొదట విచారణకు వచ్చిన కేసులు బుధ, గురు వారాల్లో విచారించాలని ఉత్తర్వు లు జారీ చేసిన కారణంగా లిస్టింగ్‌ కాలేదు. ముందుగా నిర్దేశించిన ప్రకారం గత నెల 23వతేదీనే విచారణ జరగాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ప్రభుత్వం ఓ వైపు ఉగాది నాటికి విశాఖకు పాలనా రాజధాని ని తరలించే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో త్వరితగతిన విచారణ జరిగితే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తోంది. దీంతో మూడు రాజధానుల అంశంపై త్వరితగ తిన విచారణ జరపాల్సిందిగా బుధవారం మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాజధానుల అంశాన్ని విచారిస్తున్న ధర్మాసనంలో గతంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ అమానుల్లా కూడా ఈ సారి ధర్మాసనంలో సభ్యులుగా వ్యవహరించనున్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర రాజధాని గుర్తింపునకు శివరామకృష్ణన్‌ కమిటీ వేశామని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకు నివేదించింది. అయితే మూడు రాజధానులకు ్ట 6| ఓ్లబ… సంబంధించి తమమతో సంప్రతింపులు జరపలేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదని వాదిస్తూ 2014లో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ఒతో సహా పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విభజనతో పాటు రాజధాని అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకునే వి ధంగా వాదనలు వినిపించేందుకు ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఇందులోకేంద్ర వాదనలు కూడా వినాల్సిన అవసరం ఉంది. విభజన చట్టం అంశాలతో పాటు రాజధానులకు సంబంధించి ఒకేసారి విచారణ జరపాలని భావించిన సుప్రీం కోర్టు విడివిడిగానే విచారణ జరుపుతామని ప్రకటించింది. దీంతో ముందుగా మూడుపై క్లారిటీ వస్తే మంచిదనే భావనతో మరోసారి అమరావతి పై మరోసారి సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది.

ఈ విషయమై గురువారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టీస్‌ జోసెఫ్‌, జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ అసనుద్దిన్‌ అమానుల్లా ధర్మాసనం ముందు ప్రస్తావించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అమరావతి పై హై కోర్టు ఇచ్చిన తీర్పును పునపరిశీలించాలని సుప్రీంను కోరింది. వీలైనంత త్వరలో విచారణ జరపాలని మరోసారి అభ్యర్థించింది. ఇందులో భాగంగా ప్రతివాదులైన రైతుల తరపు న్యాయవాదులకు ప్రభుత్వ న్యాయవాదులు ఈ మెయిల్‌ ద్వారా నోటీ-స్‌ లు పంపారు. గత సోమవారం జస్టిస్‌ జోసెఫ్‌ ధర్మాసనం ముందు ప్రస్తావించగా ఈ నెల 28 న కేసు విచారణ ఉంటు-ందని స్పష్టం చేసింది. మళ్లీ రెండు రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం సుప్రీం కోర్టు తలుపు తట్టింది. ధర్మాసనంలో కొత్తగా వచ్చిన జస్టిస్‌ అమా నుల్ల గతం లో ఏపీ హై కోర్టు లో న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం కోరుతున్నట్లు-గా విభజన చట్టంలో రాజధాని స్ధానంలో రాజధానులు అని మార్పుచేస్తే అనూహ్య పరిణామాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఓసారి రాజధానిగా పేర్కొన్న తర్వాత దాన్ని బహుళ రాజధానులుగా మార్చాలంటే తిరిగి కేంద్రం అనుమతి ఇవ్వాల్సిందే. అలాగే సుప్రీంకోర్టులో అమరావతి పిటిషన్ల విచారణపైనా ఈ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ఈ కారణంగానే సుప్రీంకోర్టు కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement