వైసీపీ ప్రభుత్వానికి పరిపాలనా యోగ్యత లేదని ఏపీ శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడిని ఓడించి తప్పు చేశామని ప్రజలు అనుకుంటున్నారన్నారు. 45 శాతం ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుని తప్పు చేశామని ఫీల్ అవుతున్నారన్నారు. ప్రజా వ్యతిరేక ఓట్లు విడిపోకుండా పార్టీలు ఏకం కావాలని, 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, వామపక్షాలు ఏకం కావాలని ఆకాంక్షించారు. 2024 ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్దిని నిలబెట్టాలన్నారు షరీఫ్. పవన్ కళ్యాణ్ మీద కోపంతో సినిమా రంగంపై ఈ ప్రభుత్వం కక్ష గట్టిందని, ఈ ధోరణి మంచిది కాదన్నారు. ఈ వివాదానికి పరిష్కారం కనుగొనాలని, ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడాలని షరీఫ్ అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital