Friday, November 22, 2024

Ycp counter – పొత్తులు కోసం జిత్తులు వేయడంలో చంద్ర బాబు ఘనాపాటి – సజ్జల

అమరావతి – ముఖ్యమంత్రి జగన్‌కు ప్రజల్లో ఆదరణ లేదని చెప్తున్న చంద్రబాబు.. ఇప్పుడు పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారు? అని ఏపీ ప్రభుత్వ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. .కేంద్ర హోంమంత్రి అమిత్ షా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీపై మరోసారి స్పందిస్తూ అధికారం కోసం పొత్తులు పెట్టుకోవటంలో చంద్రబాబు సిద్ధహస్తుడని విమర్శించారు.

వైసీపీ అధినేత జగన్‌కు ప్రజల్లో 80 శాతం మద్దతు ఉందని.. వచ్చే ఎన్నికల్లో తమకు సీట్లతో పాటు ఓట్లు కూడా గణనీయంగా పెరుగుతాయని ధీమా వ్యక్తం చేసింది. వైసీపీకి, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చిన ఆయన.. ఏపీ ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య సుహృద్భావ సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. తమకు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే కీలకమని తేల్చి చెప్పారు. మరోసారి జగన్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్న విషయం.. అన్నీ సర్వేల్లోనూ తేలుతోందని చెప్పారు. తమకు చంద్రబాబులా పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని.. ఒంటరిగా పోటీ చేసి, గత ఎన్నికల్లో కంటే గొప్ప విజయాన్ని నమోదు చేస్తామని నమ్మకంగా చెప్పారు

Advertisement

తాజా వార్తలు

Advertisement