అమరావతి, ఆంధ్రప్రభ: వై నాట్ 175 నినాదంతో వచ్చే ఎన్నికలకు అధికార వైకాపా సిద్ధమౌతున్న వేళ ఆ పార్టీ నియమించిన రీజినల్ కోఆర్డినేటర్ల వ్యవస్థ స్తబ్దుగా మారుతోం ది. మొదటి కేబినెట్ మార్పు అనంతరం తొలగించిన వారిలో కొంత మందిని ఎంపిక చేసిన సీఎం జగన్ వారికి పార్టీలో కీలక బాధ్యతలు అప్ప గించారు. వారిని పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లుగా నియమించి ఒక్కొక్కరికి మూడు, నాలుగు జిల్లాల బాధ్యతలు అప్పగించారు. వీరు వారికి కేటాయించిన జిల్లాల్లో తిరుగుతూ నేతల మధ్య సమన్వయ లోపం లేకుండా పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే, ఏడాది క్రితం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ ఆశించిన మేర పనిచేయడంలేదన్న భావనతో అధినేత జగన్ అప్పట్లో రీజినల్ కో ఆర్డినేటర్లుగా నియమించిన వారిలో నుండి పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి, మాజీ మంత్రులు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), అనీల్ కుమార్య యాదవ్, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్లను తప్పించి కొత్తగా మరో టీంను ఏర్పాటు చేశారు. తాజాగా మొత్తం 8 మందితో రీజి నల్ కోఆర్డినేటర్ల వ్యవ స్థను ఏర్పాటు చేశారు. ఆ తరువాత కూడా పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు. ఇది ఇప్పుడు అధికార పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెడుతోంది. తాజాగా నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివస రెడ్డి తన రీజినల్ కో ఆర్డినేటర్ పద వికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఇప్పుడు మిగతా కో ఆర్డి నేటర్ల పనితీరు అంశం పార్టీలో ప్రస్తావనకు వస్తోంది. దీనిపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వీరికి అధినేత అప్ప గించిన బాధ్యతలు, వారు ప్రస్తుతం నిర్వహిస్తున్న, పరమిత మవుతున్న బాధ్యతల గురించి నేతలు చర్చించుకోవడం గమనార్హం.
కొత్తగా నియమించిన కోఆర్డినేటర్లు వీరే
సీనియర్ నేత, విద్యుత్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లా లు, మరో సీనియర్ నేత, విద్యాశాఖా మంత్రి బొత్స సత్య నారాయణకు పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామ రాజు, శ్రీకాకుళం జిల్లాల బాధ్యతలు అప్పగించారు. అలాగే మరో సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డికి విశాఖపట్టణం, అనకా పల్లి, విజయనగరం జిల్లాలు, ఎంపీలు మిధున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్కు ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలు, ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖరల్లకు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, బీదా మస్తాన్ రావులకు పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాలు, ఆకేపాటి అమర్నాథ రెడ్డికి కర్నూలు, నంద్యాల జిల్లాలు, బాధ్యతలు అప్పగించారు.
ఒకరిద్దరు మినహా మిగతా అందరూ స్దబ్దుగానే
ఇందులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బా రెడ్డి మినహా మిగతా అందరికీ రీజినల్ కోఆర్డినేటర్ పదవి అలంకార ప్రాయంగానే మారిందన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. అడపాదడపా మంత్రి బొత్స సత్యనారయణ ఆయా జిల్లాల్లో పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయడంలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇక మిగిలిన వారెవ్వరూ కూడా వారికి కేటాయించిన జిల్లాల బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించ డంలేదన్న అభిప్రాయం పార్టీ అధిష్టానంలో ఉంది. అయితే ఇటీవలికాలంలో ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్లు మాత్రం గృహ సారధుల వ్యవస్థ ఏర్పా టుచేశాక వారికి కేటాయించిన జిల్లాల్లో పర్యటించి ఆతరు వాత మౌనంగా ఉండిపోయారన్న ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా వైవీ సుబ్బారెడ్డి కూడా ఒక్క విశాఖ జిల్లాను మాత్రమే కేంద్రంగా చేసుకుని తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు. ఈనేపథ్యంలో పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ల వ్యవస్థకు నూతన జవసత్వాలు తీసుకురావలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది.
వీరి బాధ్యతలేంటంటే
పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లుగా నియమితులైన వారు వారికి కేటాయించిన జిల్లాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సి ఉం టుంది. అదేక్రమంలో ఆయా జిల్లాల పరిధలోని నియో జకవర్గాల్లో నేతల మధ్య ఏవైనా అభిప్రాయ బేధాలు ఉంటే వాటిని చక్కదిద్దడం కోసం సమన్వయం చేయాల్సి ఉం టుంది. ఇక పార్టీ పిలుపు మేరకు జరిగే ప్రతి కార్యక్రమం కూడా ఆయా జిల్లాల్లోని నియోజకవర్గాల పరిధిలో నూటికి నూరు శాతం విజయవంతం చేసే దిశగా కార్యాచరణ చేపట్టాలి. పార్టీ లో స్థానికంగా స్థబ్దుగా ఉన్న వారిని చేర్చుకునే ప్రక్రియకు దోహ దపడాల్సి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే వీరంతా వారికి కేటాయించిన జిల్లాల్లో పార్టీ పరంగా హోల్ అండ్ సోల్ గా వ్యవహరించాల్సిన బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది.
తలనొప్పిగా మారిందా ?
ఎన్నికలకు కేవలం మరో ఏడాది మాత్రమే ఉన్న నేపథ్యం లో తమ సొంత నియోజకవర్గాల్లో అత్యధిక సమయం కేటా యించాల్సి వస్తోందని రీజినల్ కో ఆర్డనేటర్లు చెబుతున్నారు. దీంతో వారికి కేటాయించిన జిల్లాల్లో పూర్తిస్థాయిలో దృష్టిపెట్ట లేని పరిస్థితి ఉందని అంటున్నారు. ఇప్పటికే పార్టీ పరంగా గృహసారథులు, సచివాలయ కన్వీనర్ల సమావేశాలు, స్థానిక సమస్యలు-నిధుల వేట, మరోవైపు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ నిర్వహణ, ని న్నటి వరకూ జగనన్నే మా భవిష్యత్, ఈనెల 9 నుండి జగన్ననకు చెబుదాం, త్వరలో సీఎం జగన్ జిల్లాల పర్యటన ఇలా వరుస కార్యక్రమాల నేప థ్యంలో తమకు కేటాయించిన బాధ్యతలను సరిగ్గా నిర్వర్తిం చలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.