Friday, November 22, 2024

AP: కౌంటింగ్‌ రోజు వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలి: చంద్రబాబు

కౌటింగ్ రోజు వైసీపీ కుట్ర‌ల‌కు పాల్ప‌డే అవ‌కాశ‌ముంది… ఆ కుట్ర‌ల‌ను తిప్పికొట్టాల‌ని టీడీపీ అధినేత చంద్రబాబు అభ్య‌ర్థుల‌కు సూచ‌న‌లు చేశారు. ఎగ్జిట్ పోల్స్ విడుదల, ఎల్లుండి కౌంటింగ్ నేపథ్యంలో చంద్రబాబు ఇవాళ‌ ఉండవల్లి నివాసం నుంచి కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ టెలీకాన్ఫరెన్స్ లో ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. పురందేశ్వరి ఈ ఎన్నికల్లో రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయగా, నాదెండ్ల మనోహర్ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన తరఫున పోటీ చేశారు. ఇక, నేటి వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా చంద్రబాబు కౌంటింగ్ వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అభ్యర్థులకు సూచనలు చేశారు.

- Advertisement -

ఆయ‌న మాట‌ల్లోనే… ”ఎగ్జిట్ పోల్స్ అన్నీ రాష్ట్రంలో కూటమి విజయం వైపే మొగ్గు చూపాయి. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఓటమి భయంతో కౌంటింగ్‌పై వైసీపీ అర్థం లేని ఆరోపణలు చేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ తమ ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో పడింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌పై ఈసీ ఇచ్చిన ఆదేశాలపైనా కోర్టుకు వెళ్లి కొర్రీలు పెట్టేందుకు యత్నించింది. కౌంటింగ్ రోజు కూడా అనేక అక్రమాలు, దాడులకు తెగబడే అవకాశం ఉంది. కూటమి ఏజెంట్లు, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి. కౌంటింగ్ ఏజెంట్లు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి సమయానికి చేరుకోవాలి. అధికారులు నిబంధనలు పాటించేలా కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు పని చేయాలి. ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌ల నుంచి తీసుకొచ్చే సమయంలో అప్రమత్తంగా వ్యహరించాలి. పూర్తిస్థాయి ఫలితాలు వచ్చే వరకు ఎవరూ అశ్రద్ధ వహించొద్దు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఏజెంట్ కౌంటింగ్ కేంద్రంలోనే ఉండాలి. ఆర్వో వద్ద డిక్లరేషన్ తీసుకున్న తర్వాతే అభ్యర్థులు కౌంటింగ్ గది నుండి బటయకు రావాలి”అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement