మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఇప్పటికే మూడు సంవత్సరాలు వృధా చేశారని మండిపడ్డారు. డివిజన్ బెంచ్ తీర్పును యధాతధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అప్పీల్ కు వెళ్లవద్దన్ని కోరారు. మూడు రాజధానుల పేరుతో జగన్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త బిల్లు తీసుకు వస్తామని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. విభజన చట్టం ..పార్లమెంట్ చేసింది.. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఏమి చేసినా రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలని చెప్పారు.
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.. అప్పీల్ కు వెళ్లవద్దు: యనమల
Advertisement
తాజా వార్తలు
Advertisement