Friday, November 22, 2024

తంతుగా మారిన గురుకులాలు..

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్త్రంలోని గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్ధులకు మెరుగైన వసతి, నాణ్యమైన ఆహార పదార్ధాలు, సకాలంలో వైద్య సేవలు అందించాలన్నదే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి లక్ష్యం. అందుకు తగ్గట్లే విద్యార్ధులకు డైట్‌ ఛార్జీలు పెంపుదల, బలవర్ధక ఆహార పదార్ధాల పంపిణీ తదితర కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి ఆశయం గొప్ప దైనా క్షేత్రస్థాయిలో వాటి అమలుపై ఉన్నతాధికారుల పర్య వేక్షణ లోపించడంతో సత్తెనపల్లి, వాల్మీకిపురం లాంటి ఘటల ను తరచూ చోటు చేసుకుంటున్నాయి. దీంతో సీఎం ఆశయం నీరుగారిపోతోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కలుషిత ఆహారం తిని 200 మంది అస్వస్థతకు గురికాగా అన్నమయ్య జిల్లాలో మైనర్‌ బాలిక ప్రసవం.. ఇదీ రాష్ట్రంలో డాక్టర్‌ అంబే డ్కర్‌ గురుకుల పాఠశాలల్లో తరచూ చోటుచేసుకుం టున్న ఘటనలు. గురుకుల పాఠశాలల నిర్వహణపై ఉన్నతా ధికా రుల పర్యవేక్షణ కొరవవడంతో విద్యార్ధుల జీవితాలు గాల్లో దీపాలుగా మారుతున్నాయి.

గురుకుల పాఠశాలల్లోని విద్యా ధుల ఆరోగ్యం, ఆహార పదార్ధాలు వండి వడ్డించే హెల్త్‌ సూపర్‌వైజర్లు, కేర్‌ టేకర్ల నిర్లక్ష్య ధోరణి వల్లనే ఇలాంటి ఘట నలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో 190కి పైగా గురుకుల పాఠశాలలు ఉండగా వీటిలో లక్ష మందికి పైగా విద్యార్ధులు విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్ధులకు నిత్యం వండి వడ్డించే ఆహార పదార్ధాలు, వాటి నాణ్యతను పరిశీలిం చేందుకు ప్రతి పాఠశాలకు ఒక వార్డెన్‌ లేదా కేర్‌ టేకర్‌ ఉం టారు. అలాగే విద్యార్ధుల ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు ఒక హెల్త్‌ సూపర్‌వైజర్‌ను కూడా ప్రభుత్వం నియమించింది. వీరి ఉభయులకు సహాయకులుగా ప్రతి పాఠశాలలో ఒక డ్రిల్‌ మాస్టర్‌ను కూడా నియమించారు. రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో విద్యార్ధుల పట్ల వీరు ముగ్గురు విధులు నిర్లక్ష్యం గా వ్యవహరించడం మూలంగానే అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం పరిపాటిగా మారింది.


విద్యార్ధులకు వండి వడ్డించే వంటకాల్లో నాణ్యత లోపిస్తోంది. ఇందుకు నిదర్శనమే సత్తెనపల్లి ఆర్కేపురం గురుకులంలో మాంసాహార భోజనం వికటించి సుమారు 200 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. సరఫరా దారులు టెండర్‌ సమయంలో నాణ్యమైన సరుకులు చూపిం చి గురుకులాలకు నాణ్యమైన సరుకులు పంపుతున్నా.. పట్టించుకోవడంలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. తరచూ ఇలాంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చోటు చేసుకుం టూనే ఉన్నాయి. అంతేకాకుండా విద్యార్ధుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిం చేందుకు హెల్త్‌ సూపర్‌వైజర్ల నియామకం జరిగింది. అయితే, వీరు బాధ్యతలను విస్మరించడంవల్లే అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో బాలిక ప్రసవం ఘటన చోటుచేసుకుంది.


పాఠశాలల్లో హెల్త్‌ సూపర్‌వైజపర్లు, సూపర్‌వైజర్లు విద్యా ర్ధుల ఆరోగ్యంపట్ల శ్రద్ధచూపకపోగా అనారోగ్యం పాలైనప్పు డు తల్లిదండ్రులకు సమాచారం అందించి వారిని ఇళ్లకు పంపి చేతులు దులుపుకుంటున్నా రన్న ఆరోపణలు ఉన్నా యి. అయితే, విద్యార్ధులకు మందులు వాడినట్లు, మెరుగైన వైద్య సేవలు అందించినట్లు నకిలీ బిల్లులు సృష్టించి అక్రమా లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ప్రధానంగా పాఠశాలలో ప్రిన్సిపల్‌ పర్యవేక్షణతోపాటు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కేర్‌ టేకర్లు, హెల్త్‌ సూపర్‌వైజర్లు, పీఈటీలు విధులపట్ల నిర్లక్ష్యం వహరిస్తున్న ట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా కేర్‌ టేకర్లు, హెల్త్‌ సూపర్‌వైజర్లు ఆయా పాఠశాలల ప్రిన్సిపల్స్‌కు మధ్య ఆర్ధిక లావాదేవీలు ఉండటం మూలంగానే విద్యార్ధులకు అందాల్సి న ఆహారపదార్ధాల్లో నాణ్యత లోపించడం, అనారోగ్యాల పాలవడం జరుగుతుందని చెబుతున్నారు. పాఠశాల నిర్వహ ణను పర్యవేక్షించాల్సిన జిల్లా అధికారులు (డీసీవో) పాఠశా లల ప్రిన్సిపల్స్‌కు మధ్య ఆర్ధిక లావాదేవీలు ఉండటం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి నిదర్శనమే మంగళవారం ప్రకాశం జిల్లా డీసీవో పదవీ విరమణ సందర్భంగా జరిగే కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల కేర్‌ టేకర్లు విధిగా హాజరుకావాలని ఆదేశాలు ఇవ్వడమే. అంతేకాకుండా సాయంత్రం జరిగే పదవీ విరమణ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్స్‌ బయోమెట్రిక్‌ వేసి ఉదయమే పదవీ విమరణ కార్యక్రమానికి హాజరైనట్లు సమాచారం. ఇలాంటి ఘటనలపై నామమాత్రపు చర్యలు తప్ప పరిష్కార మార్గాన్ని చూడకపోవడంతో సత్తెనపల్లి, వాల్మీకిపురం ఘటనలు పరిపాటిగా మారాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలలపై క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందా లతో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తే విద్యార్ధులకు నాణ్యమైన ఆహారపదార్ధాలతోపాటు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement