విజయనగరం, (ప్రభ న్యూస్) : జిల్లా కేంద్రంలో రైతు బజార్ల ఆధునీకరణ పనులు నిలిచిపోయాయి. స్థానిక దాసన్నపేట రింగ్‌రోడ్డు రైతు బజారులో ఆధునీకరణ పనులు, ఆర్‌అండ్‌బి రైతు బజార్‌లో దుకాణాల విస్తీర్ణం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారయ్యాయి. దాసన్నపేట రైతు బజారులో వద్ద రోడ్డు విస్తరణ కారణంగా కొన్ని దుకాణాలు తొలగించారు. ఈ నేపధ్యంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు చాలా వరకూ చేపట్టినా చివరిదశలో నిలిచిపోయాయి. ముఖ్యంగా రైతు బజార్‌కు రెండు వైపులా ప్రధాన మార్గాల వద్ద గేట్లు ఏర్పాటు చేయలేదు. కొన్ని దుకాణాలు తొలగించే వదిలేశారు.
దీంతో ఆ బజారు నిర్వహణ ఆధ్వాన్నంగా తయారైంది. దీంతో అభివృద్ధి జాడ ఎక్కడా కనిపించలేదు. ఆర్‌అండ్‌బి రైతుబజార్‌లో దుకాణాల విస్తరణ పనులు నిలిచిపోయాయి. ఆయా పనులకు నిధులు సమస్యవెంటాడుతోందని అధికారులు చెబుతున్నారు. విజయనగరం మార్కెట్ కమిటీ చైర్మన్ నడిపేన శ్రీనివాసరావు వివరణ కోరగా నిధులు సమస్య కారణంగా పనులు జరగలేదని చెప్పారు. ఆయా పనులు చేపట్ట్టడానికి సుమారు రూ. కోటిల వరకూ అవసరం ఉందని, ప్రస్తుతానికి ఆ మేరకు నిధులు లేవన్నారు. అభివృద్ధి పనులు, నిధులు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, త్వరలో ఆయా పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily