Tuesday, November 26, 2024

కడపలో ప్రపంచ నీటి దినోత్సవ వేడుకలు..

ఆంధ్రప్రభ : దేశంలో సుప్రసిద్ధ సిమెంట్‌ తయారీ సంస్థలలో ఒకటైన దాల్మియా భారత్‌ లిమిటెడ్‌ ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ప్లాంట్‌ లోపల చుట్టు పక్కల ప్రాంతాలలో నీటి పరరక్షణకు నడుం బిగించింది. దీంతో కడపలోని ప్లాంట్‌ ఇప్పుడు 5 రెట్లు నీటి సానుకూలతను సాధించింది. గత రెండేళ్లలో 150కి పైగా జల సేకరణ, నిర్మాణాలను నిర్మించడం ద్వారా కడప జిల్లాలోని స్థానిక కమ్యూనిటీలకు సాయం అందించడంతో పాటు 2018 నుంచి మొత్తంగా 300 నిర్మాణాలను నిర్మించిన ఘనతను సాధించింది. నీటి పరిరక్షణ లక్ష్య సాధనలో భాగంగా కడపలో పలు కార్యక్రమాలను దాల్మియా భారత్‌ ప్రారంభించింది.

ఇందులో భాగంగా దాదాపు 8300 మంది ప్రజలు నవాబ్‌పేట, తలమంచిపట్నం, పెద్దకొమర్ల, భీమగుండం, భూతమాపురం వద్ద భూమి, నీటి పరిరక్షణ ప్రాజెక్టుల ద్వారా లబ్ది పొందుతున్నారు. దాల్మియా సిమెంట్స్‌ చేపట్టిన నీటి పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా వాటర్‌ పాజిటివిటిని లక్ష్యంగా చేసుకోవడం వల్ల 2025 నాటికి తము వినియోగించే నీటికి 20 రెట్లు అధికంగా నీటిని ఉత్పత్తి చేయనుంది.

- Advertisement -

ఈ కార్యక్రమాల నిర్వహణపై కడప యూనిట్‌ హెడ్‌ ముకేశ్‌ సిన్హా మాట్లాడుతూ తమ కంపెనీ లాభదాయకమైన, పర్యావరణ అనుకూల క్లీన్‌, గ్రీన్‌ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నామనీ, నీటి పరిరక్షణ పరంగా తాము నిర్వహిస్తున్న కార్యక్రమాల కారణంగా స్టేక్‌ హోల్డర్ల జీవితంలో నాలుగు రెట్ల విలువ సృష్టించబడిందన్నారు. సిమెంట్‌ పరిశ్రమలో నీటి వినియోగం తక్కువే అయినప్పటికీ దాల్మియా భారత్‌ కమ్యూనిటీలకు నీటి సదుపాయాన్ని పెంచడం, సహజ పర్యావరణ సంస్థల పరిరక్షణకు కృషి చేస్తుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement