విజయవాడ: మాతృభాషను భవిష్యత్తు తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా ప్రపంచ ఆరో తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు తల్లి విగ్రహానికి సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నివాళులర్పించారు.
మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ అంజలి ఘటించారు. నగరంలోని కె.బి.ఎన్.కళాశాల ప్రాంగణంలో నేటి
నుంచి రెండు రోజులపాటు జరిగే ఈ వేడుకల కోసం దేశవిదేశాల నుంచి 1500మందికి పైగా కవులు, రచయితలు, భాషాభిమానులు తరలివచ్చారు.
- Advertisement -