Friday, September 20, 2024

AP | శ్రీశైలం దేవస్థానానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ సర్టిఫికేట్

శ్రీశైలం, ప్రభ న్యూస్ : శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి మరో అరుదైన రికార్డు దక్కింది. శ్రీశైల దేవాలయం ఇంగ్లండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. శ్రీశైలం ఆలయ విస్తార్ణం, అలాగే ఆలయంలోని నంది విగ్రహానికి, ఆలయ నిర్వహణకు ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది.

శ్రీశైలం దేవస్థానానికి ద‌క్కిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్ ను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, అలయ ఈవో పెద్దిరాజ్ లకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాయింట్ సెక్రటరీ ఉల్లాజీ ఎలియేజర్ అందజేశారు. సర్టిఫికెట్ అందుకున్న‌ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీశైలం ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేయడం నా అదృష్టమని అన్నారు. శ్రీశైల ఆలయానికి లండన్ నుంచి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అయితే గతంలో ఆలయంలోని 7 విభాగాలకు ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌ పొందిన శ్రీశైలం మల్లన్న ఆలయం సొంతమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement