Friday, November 22, 2024

AP : జగన్ అనాలోచిత నిర్ణయాలతో కార్మికులు రోడ్డున ప‌డ్డారు… నారా లోకేష్‌..

జగన్ అనాలోచిత నిర్ణయాలతో నిర్మాణరంగం కుదేలై భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని నారా లోకేష్ మండిప‌డ్డారు. మంగళగిరి గ్రేట్ ఇండియా సెంటర్ లో అడ్డాకూలీలతో మంగళవారం ఉదయం భేటీ అయిన లోకేష్ వారి సమస్యలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ జగన్ ధనదాహంతో ఇసుక అందుబాటులో లేకుండా చేయడంతో రాష్ట్రంలోని 30లక్షలమంది భవన నిర్మాణ కార్మికులు పనులులేక రోడ్డున పడ్డారని లోకేష్ ధ్వజమెత్తారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో నిర్మాణరంగం పడకేసిందని, మూడుముక్కలాటతో అమరావతి పనులు నిలిపేయడంతో కార్మికులు పొట్టచేతబట్టుకొని పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. అమరావతి నిర్మాణం కొనసాగించి ఉంటే ఐదు లక్షలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేవని ఆయన అభిప్రాయపడ్డారు. టీడీపీ పాలనలో ట్రాక్టర్ ఇసుక రూ.1500 ఉంటే.. జగన్ రెడ్డి పాలనలో రూ.5వేల నుంచి రూ.7వేల వరకు పెరిగిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక చంద్రన్న భీమా పునరుద్దరిస్తామని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement