Tuesday, November 26, 2024

డ్రైవర్‌ని కొట్టిన మహిళకు జైలు..

విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌పై బూతులు తిడుతూ.. కాళ్లతో తన్నిన మహిళకు కోర్టు శిక్ష విధించింది.  ఈ నెల 9వ తేదీన జరిగిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమెను కోర్టులో హాజరు పరిచారు. డ్యూటీలో ఉన్న డ్రైవర్‌పై దాడి చేసిన నేరానికి 14 రోజుల పాటు రిమాండ్‌కు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఫిబ్రవరి 9న విజయవాడలోని విద్యాధరపురం డిపోకు చెందిన 5వ నెంబర్ బస్ రూట్‌లో ఆంధ్రా హాస్పిటల్ వన్ వేలో డ్రైవర్ మొండితోక ముసలయ్య బస్సును నడుపుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో రాంగ్ రూట్‌లో ఓ మహిళ రావడంతో ఆయన సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో ఆమె డ్రైవర్‌పై రెచ్చిపోయింది. రాంగ్ రూట్‌లో వచ్చినంత మాత్రాన ఢీకొట్టి చంపేస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు బూతులు తిడుతూ.. బస్సులోకి ఎక్కి మరీ డ్రైవర్‌ను కాళ్లతో తన్నింది. డ్రైవర్‌ను అతని చొక్కా కాలర్‌ను లాగి అసభ్యంగా ప్రవర్తించింది. ఎదురుగా వస్తున్న తన వాహనాన్ని బస్సు ఢీకొట్టిందని ఆమె ఆరోపించింది.

మహిళ వీరంగాన్నంతా లేడీ కండక్టర్ వీడియో తీశారు. దీంతో కండక్టర్‌ను సైతం ఆమె దుర్భాషలాడారు. మహిళ వికృత ప్రవర్తనపై దిగ్భ్రాంతి చెందిన కొందరు ప్రయాణికులు.. డ్రైవర్‌ను కొట్టడం ఆపాలని మహిళను కోరారు. కానీ ఆమె అసభ్య పదజాలంతో ఇంకా రెచ్చిపోయింది. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనపై కేసు నమోదు చేశారు. మహిళను సూర్యారావు పేట్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేపట్టారు. ఈ ఘటనలో తప్పు ఆ మహిళదేనని కోర్టులో రుజువు కావడంతో 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement