Saturday, November 23, 2024

ఎపిలో ఆమెకు అంద‌లం…

అమరావతి, ఆంధ్రప్రభ: ఆర్ధిక స్వావలంబ న, రాజకీయ సాధికారత దిశగా మహిళల సంక్షేమం, అభివృద్ది కోసం గడిచిన నాలుగే ళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ప్రత్యక్ష, పరోక్ష ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఏటా కేటాయిస్తున్న నిధుల్లో మూడింట రెండొంతులు మహిళలకే చేరుతు న్నాయి. గడిచిన నాలుగేళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ-)తో పాటు- పరోక్ష ప్రయోజ నాల కోసం సుమారు 2,50,000 కోట్లను పంపిణీ చేయగా అందులో 1,70,000 వేల కోట్లు- నేరుగా మహిళలకే చేరినట్టు- అంచనా. గ్రామ, వార్డు సచివాలయాల కోసం నియమితులైన సుమారు 2.6 లక్షల మంది వాలంటీ-ర్లలో 53 శాతం మంది మహిళలే ఉన్నారు. సచివాలయాల్లో పని చేస్తున్న 1.3 లక్షల మంది సిబ్బందిలో 51 శాతం మహిళలే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతిష్టా త్మకంగా అమలు చేస్తున్న అమ్మ ఒడి ఆర్ధిక సాయం నేరుగా విద్యార్ధుల తల్లుల బ్యాంకు ఖాతాలకే చేరుతుంది. వైఎస్‌ఆర్‌ ఆసరా ద్వారా సుమారు కోటి మంది డ్వాక్రా గ్రూపు మహిళ లు లబ్ది పొందుతున్నట్టు- ప్రభుత్వం ప్రకటిం చింది. వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం ద్వారా మహిళలు ఇప్పటి వరకు రూ 2,500 కోట్లకు పైగా ఆర్ధిక సాయాన్ని పొందారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ- మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ చేయూత అందిస్తోంది.

నెలానెలా పెన్షన్‌ అందుకుంటు-న్న 60 లక్షల మందికి పైగా వృద్ధులు, వికలాంగులు, వితంతువుల్లో సుమారు 35 లక్షల మంది మహిళలు ఉన్నట్టు- అంచనా. రాష్ట్రంలో సుమారు 22 లక్షల మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో విద్యాదీవెన-వసతి దీవెన పథకం నగదు జమ అవుతోంది. మూడేళ్లలో జగనన్న విద్యా దీవెన పథకం కింద రూ.6,260 కోట్లు-, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.1800 కోట్లు-, వసతి దీవెన కింద రూ.2,305 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కింద గర్భిణిలు, బాలింతలకు మంచి ఆహారం అందించే పథకం కూడా విజయవంతమైంది. గిరిజన ప్రాంతాల్లో అయితే సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాన్ని అమలు చేస్తున్నారు. సుమారు 31 లక్షల మంది ఈ పథకం కింద లబ్ది పొందుతున్నట్టు- అంచనా. రాష్ట్రంలో సుమారు 31 లక్షల మంది మహిళలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వటంతో పాటు- గృహాలు నిర్మించే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపట్టింది. రూ 5 లక్షల నుంచి రూ 10 లక్షల విలువ చేసే ఆస్తిని పూర్తిగా మహిళల పేరు మీదనే రాసి పట్టాలు ఇస్తున్నట్టు- ప్రభుత్వం వెల్లడించింది. వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం ద్వారా ఆ సామాజికవర్గానికి చెందిన సుమారు 3.3 లక్షల మంది మహిళలు లబ్ది పొందుతున్నారు. ఈబీసీ నేస్తం కింద 45 నుంచి 60 ఏళ్ళ మధ్య వయసున్న సుమారు 4 లక్షల మంది ఓబీసీ మహిళలకు ఏటా రూ 15 వేలు అందించే పథకాన్ని కూడా ప్రభుత్వం అమలు చేస్తోంది. గత ఏడాది వరకు ఈ పథకం కింద రూ 1.18 లక్షల కోట్లను పంపిణీ చేసినట్టు- అంచనా. నామినేషన్‌ విధానంలో అప్పగించే కాంట్రాక్ట్‌ పనుల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అందించి వారి ఆర్ధిక స్వావలంబనకు దోహదపడినట్టు- రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

పదవుల్లోనూ ప్రాధాన్యత
నామినే-టె-డ్‌ పదవుల నియామకాల్లోనూ మహిళలకు 50 శాతం వాటా ఇచ్చినట్టు- ప్రభుత్వం చెబుతోంది. మొత్తం 51 నామినే-టె-డ్‌ పోస్టుల్లో మహిళలను నియమించాం..1151 డైరెక్టర్‌ పదవుల్లో 586 మహిళలకు ఇచ్చాం.. 202 మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ పదవుల్లో 102 మహిళలకిచ్చినట్టు- ప్రభుత్వం వెల్లడించింది. 45 మంది మహిళలు మున్సిపల్‌ చైర్మన్లుగా ఉన్నారు. 2123 వార్డుల్లో 1161 మంది మహిళలున్నారు. సర్పంచ్‌ పదవుల్లో 57 శాతం, ఎంపీటీ-సీల్లో 54 శాతం, మండల అధ్యక్షుల్లో 53 శాతం, జడ్పీటీ-సీల్లో 53 శాతం మహిళలకు ఇచ్చి పట్టం కట్టినట్టు- ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్‌ చైర్మన్లలో 7 గురు మహిళలే.. 26 మంది జడ్‌ పీ వైస్‌ చైర్మన్లలో 15 మంది మహిళలే.. 12 మేయర్‌ పోస్టులు, 24 డిప్యూటీ- మేయర్‌ పదవులు ఇవ్వటం ద్వారా మహిళా సాధికారతకు పట్టం కట్టినట్టు- ప్రభుత్వం ప్రకటించింది.

దిశతో రక్షణకు భరోసా
దిశ చట్టం తీసుకురావటం ద్వారా మహిళల రక్షణకు సంపూర్ణ భరోసా కల్పించినట్టు- ప్రభుత్వం వెల్లడించింది. 7 రోజుల్లో దర్యాప్తు.. 14 రోజుల్లో విచారణ, 21 రోజుల్లో శిక్ష పడే విధంగా బిల్లు రూపొందించాం. ఈ బిల్లుకు కేంద్రం నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఒకవైపు ఆ అనుమతి కోసం ప్రయత్నిస్తూనే, మరోవైపు అందులో అంశాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటు-న్నట్టు- ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు 1.13 కోట్ల మంది మహిళలు దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఆపద వస్తుందని భావించే మహిళలు దిశ యాప్‌ ద్వారా క్షణాల్లో పోలీసులకు సమాచారమందించి రక్షణ పొందుతున్నారు. వివిధ సందర్భాల్లో రాష్ట్రంలో సుమారు వెయ్యి మంది దిశ యాప్‌ ద్వారా రక్షణ పొందినట్టు- ప్రభుత్వం ప్రకటించింది.

- Advertisement -

90 శాతం పథకాలు మహిళలకే..!
మహిళలకే 90 శాతం పథకాలు అందుతున్నాయి.. మహిళా సాధికారత అంటే ఏమిలో ఆచరణలో అమలు చేసిన చూపించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుంది.. ఆరోగ్యశ్రీలో 3255 ప్రొసీజర్లను పెంచటం ద్వారా మహిళలకు ప్రత్యేకంగా వచ్చే అనేక వ్యాధులకు ఉచితంగా చికిత్స అందుతోంది. -విడదల రజనీ, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి

దిశ యాప్‌ తో భద్రత
దిశా యాప్‌ తో మహిళలకు భద్రత, భరోసా లభించింది..హైదరబాద్‌ సంఘటనతో చలించిపోయిన సీఎం జగన్‌ దిశ చట్టం తీసుకొచ్చి మహిళలకు అండగా నిలిచారు – రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్‌.కె రోజా

పథకాలతో మహిళ జీవితాల్లో వెలుగులు
వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత, అమ్మఒడి, కాపునేస్తం, విద్యాదీవెన, విద్యా వసతి వంటి అనేక పథకాల ద్వారా మహిళల జీవతాల్లో వెలుగులు నింపి వారిని ఆర్ధిక స్వావలంబన దిశగా ముందుకు తీసుకెళుతున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుంది. గర్భిణీ స్త్రీలు క్షేమంగా చికిత్స అనంతరం ఇంటికి చేర్చేలా తల్లీబిడ్డ ఎక్స్‌ ప్రెస్‌ వాహనాలను ప్రత్యేకంగా ఏర్పాటు- చేయటం పేద మహిళల సమస్యల పరిష్కారం పట్ల సీఎంకున్న ప్రత్యేక శ్రద్దకు తార్కాణం -వాసిరెడ్డి పద్మ, ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement