Saturday, November 23, 2024

సచివాలయ ఉద్యోగిపై తహసీల్దార్ ఫైర్.. ఆత్మహత్యాయత్నం చేసిన యువతి

చిత్తూరు జిల్లా కుప్పం తహసీల్దార్ సురేష్ బాబు సచివాలయ ఉద్యోగులపై తీవ్రస్థాయిలో ఫైర్ కావడంతో ఓ మహిళ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. కుప్పం తహసీల్దార్ కార్యాలయంకు అనధికార కప్పం చెల్లించాలని సదరు మహిళ ఉద్యోగిపై ఒత్తిడి పెంచి ఆమెపై తహసీల్దార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ”నేను చెప్పింది విని డబ్బులు కార్యాలయ సిబ్బంది దాము వద్దకు నగదు చేర్చాలని లేని పక్షంలో త్వరలో నేను జాయింట్ కలెక్టర్ గా వస్తాను అప్పుడు నీ ఉద్యోగం ఎలా ఉంటుందో చుస్తా” అంటూ తహసీల్దార్ సురేష్ బాబు హెచ్చరించారు. అలాగే నీకు సచివాలయ గ్రామ సర్వేయర్ గా ప్రోహబిశాన్ ఎలా డిక్లర్ అవుతుందొ చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో కుప్పం మండలం నడుమురు సచివాలయ గ్రామ సర్వేయర్ లావణ్య నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. దీంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతంకు ఆమె ఆరోగ్యం విషయంగా ఉన్నదని గ్రామస్తులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement