Friday, November 22, 2024

AP: తోటకనుమలో విషజ్వరాలు.. మహిళ మృతి..

వి.కోట.. మండల పరిధిలోని తోటకనుమ పంచాయితీలో విషజ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత వారం రోజులుగా పంచాయితీలోని అన్ని పల్లెలో ఎటుచూసినా జ్వర బాధితులే కంట పడుతున్నారు. శుక్రవారం తోటకనుమకు చెందిన గంగరాజు భార్య స్వాతి (20) విషజ్వరంతో మృతి చెందింది. ఆమె ఎనిమిది నెలల చిన్నారికి జ్వరం కారణంగా పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు కుప్పం పీఈఎస్ వైద్య కళాశాలకు తరలించారు. గ్రామంలో ప్రతి ఇంట్లోను జ్వరాలతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నా.. జ్వరాలు అదుపుకావడం లేదు. గ్రామంలో ఏఎన్ఎం లు రచ్చ వద్దకు వచ్చి కాలక్షేపం చేసి వెళ్ళుతున్నారే తప్పా కనీసం వైద్య శిబిరం ఏర్పాటు చేయలేదని గ్రామస్తులు వాపోతున్నారు.

పల్లెల్లో పారిశుద్ధ్యం లోపించడం వల్లే జ్వరాలు ప్రబలినట్లు తెలుస్తోంది. కార్యదర్శికి జ్వరాలపై తెలిపినా పారిశుద్ధ్యం పై దృష్టి సారించలేదు. వైద్య ఆరోగ్య శాఖ జ్వరాలను అదుపు చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. అక్కడి సర్పంచ్ ను వివరణ కోరగా… పంచాయతీలో నిధులు లేకపోవడంతో మురుగు కాలువలు శుభ్రం చేయలేక పోయామని వాపోయారు. కనీసం మండల నిధులేమైనా ఇస్తారా అంటే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుండి ఎంపీపీ యువరాజ్ అందుబాటులో లేరన్నారు. కావున మెడికల్ అధికారులు తోటకనుమలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయకపోతే జ్యరాలు విజృంభించండం ఖాయమన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement