తుగ్గలి, జనవరి 3 (ఆంధ్రప్రభ) : మండల పరిధిలోని రామలింగయ్యపల్లె గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం కంది కటింగ్ మిషన్ లో పడి ప్రమాదవశాత్తు ఓ మహిళ దుర్మరణం చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
రామలింగయ్యపల్లె గ్రామానికి చెందిన మాధవయ్య తను కౌలుకు చేసిన పొలంలో కందికట్టలను కటింగ్ మిషన్ లో మాధవయ్య భార్య అనంతమ్మ వేస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె చీర మిషన్ కు చుట్టుకోవడంతో ఆమె మిషన్ లో పడి ప్రమాదవశాత్తు చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు.
- Advertisement -