Friday, November 22, 2024

అపోలో ఉద్యోగిపై దురుసు ప్రవర్తన.. పోలీసుల తీరుపై విమర్శలు

విశాఖపట్నంలో అపోలో ఆస్పత్రి ఫార్మసీలో పని చేస్తున్న మహిళా ఉద్యోగిపై పోలీసులు ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. విశాఖలోని రామాటాకీస్, అపోలో పార్మసీలో పని చేసి ఇంటికి వెళ్తున్న తనని పోలీసులు అడ్డగించి కేసు నమోదు చేశారని ఆ యువతి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పోలీసుల దురసు ప్రవర్తనపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.

అపర్ణపై పోలీసులు దురుసుగా వ్యవహరించిన తీరును భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఖండించింది. దీనికి బాధ్యులైన పోలీసులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. కరోనాలో సైతం తమ ప్రాణాలకు తెగించి ఆసుపత్రిలో పని చేస్తూ ప్రతి రోజు తన డ్యూటీకి ఉదయం ఆటోలో వస్తున్నది. సాయంత్రం తన పని ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్లే సమయానికి కర్ఫ్యూ కారణంగా రవాణ వ్యవస్థ అందుబాటులో లేదు. దీంతో ఆ అమ్మాయిని పికప్ చేసుకోవడానికి వస్తున్న ప్రెండ్ టూవీలర్ ను పోలీసులు ఆపి, వాహన అనుమతి పత్రం చూపించినా వినకుండ ఫైన్ వేశారు. అమ్మాయి వచ్చి ఐడి కార్డు, అనుమతి పత్రం చూపించినా విడిచిపెట్టకుండా బండి తాళం చేవి, ఇద్దరి సెల్ ఫోన్లు పోలీసులు లాక్కున్నారు. అబ్బాయిని కొట్టి పోలీసు జీపు ఎక్కించారు. ఇది తప్పు ఒక ఉద్యోనిపై ఈ కరంగా వ్యవహరించడం తగదు అని ఆ అమ్మాయి ప్రశ్నించి నందుకు బలవంతంగా రోడ్డు మీద పోలీసుల లాక్కెళ్లడం, అమ్మాయిని, తన ప్రెండ్ ను బయబ్రాంతులకు గురిచేసి దురుసుగా ప్రవర్తించారు.

ఒక మహిళా ఉద్యోనిపై ఈ కరంగా పోలీసులు వ్యవహరించడం దారుణం అని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రామన్న ఆక్షేపించారు. అక్కడే ఉండి ఈ దారుణాన్ని ప్రోత్సహించిన ఎస్సై పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనలో పాల్గొన్న పోలీసులందరిపై చర్యలుండాలని డిమాండ్ చేశారు. డ్యూటీలో ఉద్యోగులందరికి ప్రభుత్వమే రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇలాంటి ఘటనల నుండి ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement