Thursday, November 21, 2024

దైవ చింతన లేకనే.. అనర్థాలు: స్వరూపానందేంద్ర స్వామీ..

వేపాడ, (ప్రభ న్యూస్‌): హిందూ సనాతన ధర్మాన్ని పాటించకపోవడం దైవారధన కొరవడడం ప‌ల్లే ప్రజలు కష్టాలుపాలవుతున్పారని విశాఖజిల్లా చినముషిడివాడ శారదాపీఠం అధిపతులు స్వరూపానందేంద్ర స్వామీజి అన్నారు. మండలంలోని సింగరాయి శివారు కొత్త సింగరాయిలో గల అయ్యప్పస్వామి వారి ఆలయం వద్ద మంగళవారం రాత్రి జరిగిన అయ్యప్పపడి పూజలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామీజి మాట్లాడుతూ ప్రజల్లో పాపభీతి, దయాగుణం, ప్రేమాభిమానాలు కొరవడడం వల్లే అతివృష్టి, అనావృష్టి వర్షాలు పడి పంటలు పండడం లేదన్నారు

ప్రతీ ఒక్కరిలో భక్తి భావం పెరిగితే సమాజం క్షుభిక్షంగా ఉంటుందన్నారు. ఈసందర్భంగా స్వరూపానందేంద్ర స్వామీజి గ్రామ సర్పంచ్‌ నిరుజోగి వెంకటరావు, ఎంపీటీసీ సభ్యుడు రాయవర పు రాజీవ్‌, మాజీ ఎంపీపీ వేచలపు వెంకటచినరామునాయుడు, వందలాది మంది అయ్యప్ప స్వాములు స్వామివారికి పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకున్నారు. స్వామివారి సందర్శనార్ధం భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాడంతో ఎస్‌కోట సీఐ సింహాద్రినాయుడు, వల్లంపూడి ఎస్‌ఐ దేవి బందోబస్తు నిర్వహించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement