ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 2016-19 మధ్య కాలంలో కాపు రిజర్వేషన్ ఉద్యమం జరిగింది. కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో నమోదైన కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ఏపీ హోంశాఖ ఉత్తర్వులను విడుదల చేసింది. ఉద్యమ సమయలో ఉద్యమకారులపై 176 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఇప్పటికే 153 కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కాపు రిజ్వేషన్ ఉద్యమంలో నమోదైన అన్ని కేసులను ప్రభుత్వం ఈ ఉత్తర్వుల ద్వారా ఉపసంహరించుకున్నట్లయింది. ఆ ఉద్యమ సమయంలోని కేసుల మొత్తాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..