కశింకోట,(అనకాపల్లి) జూన్ 29 (ప్రభ న్యూస్) : పరిమితులకు లోబడి హుందాగా పని చేస్తానని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. స్పీకర్ పదవీ స్థానానికి మరింత గౌరవం పెరిగేలా పని చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.
ఇవాళ ఉదయం విచ్చేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడును మర్యాద పూర్వకంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి, ఎస్పీ మరళీకృష్ణలు కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి సత్కరించారు. అనంతరం మీడియాతో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ… అతి చిన్న వయసులో ఎన్టీఆర్ మంత్రి పదవి ఇచ్చారని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్పీకర్ పదవి ద్వారా అత్యున్నత గౌరవం ఇచ్చి ప్రధాన బాధ్యతలు అప్పగించారన్నారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, పరిమితులకు లోబడి హుందాగా పని చేస్తానని పేర్కొన్నారు.
- Advertisement -