Friday, November 22, 2024

ఇష్టమొచ్చినట్లు రిమాండ్‌ విధిస్తారా? పోలీసులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లుగా రిమాండ్‌లు విధించడం కుదరదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. దిగువ కోర్టుల మెజిస్ట్రేట్లు విచక్షణతో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదైన 24 గంటల్లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించింది. విచక్షణ లేకుండా రిమాండ్‌కు ఆదేశించిన పక్షంలో బాధితులు హైకోర్టును ఆశ్రయిస్తే సదరు మెజిస్ట్రేట్లపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎఫ్‌ఐఆర్‌ వివరాలు వెల్లడించకుండా అరెస్టులు, రిమాండ్‌లు చేస్తున్నారని బాధితుడు తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.

167 సీఆర్పీసీ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనతో ఏపీ హైకోర్టు ఏకీభవించింది. పోలీసుల చర్యలను పరిగణనలోకి తీసుకోకుండా రిమాండ్ విధించడం హక్కుల ఉల్లంఘన అని, నిందితులకు అభియోగాల వివరాలను వెల్లడించకపోవడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని న్యాయవాది ఉమేష్ చంద్ర పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement