ఈనెల 23వతేదీన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరతానని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనతో పాటు అనుచర గణం కూడా టీడీపీలోకి వస్తారన్నారు. జగన్ మీడియా తనపై అసత్యఆరోపణలు చేయటానికి సిద్ధంగా ఉందన్నారు. జగన్ మాటలను ఒక్కసారి తిరిగి ఆలోచించుకోండని కన్నా అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే అరాచకపాలన మొదలు పెట్టారన్నారు. అరాచక పాలనకు తోడు పోలీస్ వ్యవస్థ కూడా దిగజారిపోయిందన్నారు.
అరాచకాలు చేస్తున్న వారిని వదిలిపెట్టి పోరాటం చేసే వారిపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. పోలీసు వ్యవస్థ అరాచక వాదులకు అనుగుణంగా నడుస్తున్నారా అని ప్రశ్నించారు. జగన్ అధికారం శాశ్వతం కాదు, ప్రజలు తిరగబడిన రోజున మీకు ఎవరు తోడు వుండరని కన్నా హెచ్చరించారు. గన్నవరం టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎవరికైనా అన్యాయం జరిగితే పోలీసులను ఆశ్రయిస్తారు, పోలీసులే పట్టించుకోకపోతే ఎవరిదగ్గరకు వెళ్లాలని ప్రశ్నించారు. డీజీపీ తక్షణమే రాష్ట్రంలో జరిగే అరాచకాలకు స్వస్తి పలకాలని సూచించారు.