కర్నూలు జిల్లా (తుగ్గలి) – ఓ ఇల్లాలు తన భర్త నాలుకను ఏకంగా కట్ చేసేసింది.. ఈ ఘటన తుగ్గలి మండలంలో జరిగింది. వివరాలలోకి వెళితే కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం,తుగ్గలి మండలం పరిధిలోని ఎల్లమ్మ గుట్ట తండాలో పుష్పావతి, చందు నాయక్ దంపతులు నివసిస్తున్నారు..
వారి మధ్య శుక్రవారం ఒక విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది.. అది ముదిరి ఘర్షణగా మారింది.. కోపంతో ఉన్న భార్య భర్తను దగ్గరకు తీసుకుని ముద్దు పెడుతున్నట్లు నటిస్తూ నాలుకను గట్టిగా కొరికేసింది.. దీంతో కొంత భాగం నాలుక తెగింది.. దీంతో భర్త లబోదిబో అంటూ గుత్తి హాస్పిటల్ కి పరుగెత్తాడు.. అక్కడ చిన్న సైజ్ సర్జరీ చేసి గండం నుంచి గట్టేక్కించారు వైద్యులు