Friday, November 22, 2024

విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు.. త‌గ్గుతున్న టెంప‌రేచ‌ర్లు..

అమరావతి, ఆంధ్రప్రభ: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో విస్తరిస్తున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుముఖం పడుతున్నాయి. ఉత్తర దక్షిణ ద్రోణి దక్షిణ బీహార్‌ నుండి దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌ వరకు తూర్పు మధ్యప్రదేశ్‌ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉంది. రానున్న మూడు రోజుల్లో ఉత్తరకోస్తా, యానం, దక్షిణకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలకపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

రాబోయే 2-3 రోజుల్లో విదర్భ మరియు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్‌ లోని మరికొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతం, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు, గంగానది పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌, మొత్తం ఉపహిమలయన్‌ పశ్చిమ బెంగాల్‌ మరియు బీహార్‌లోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతి వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement