ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టగా.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని ముఠగట్టుకుంది.. అయితే, ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున పని చేసిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. ఇక, పనిలో పనిగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు రావెల కిషోర్‌బాబు.. తాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడి పనిచేసాను అన్నారు రావెల..
2014లో నాకు చంద్రబాబు నాయుడు రాజకీయంగా అవకాశం ఇచ్చి ప్రోత్సహించారని గుర్తుచేసుకున్నారు. అయితే, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారం తెస్తానన్న మాటలు నమ్మి తాను వైసీపీలో చేరాను అన్నారు. కానీ, ఈ ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు వైఎస్ జగన్ ని తిరస్కరించారని తెలిపారు.. ఈ రాష్ట్రం అభివృద్ది చెందాలంటే నారా చంద్రబాబు వల్లనే సాధ్యమవుతుందన్నారు. ఇక, తెలుగు దేశం, జనసేన, బీజేపీ కూటమికి ప్రజలు అఖండ విజయం ఇచ్చారని ప్రశంసించారు.