అధికార పార్టీ నేతలపై నిఘా ఎందుకు అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. బాలినేని వ్యాఖ్యలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందంటే ఆశ్చర్యం వేస్తుందన్నారు. తన దగ్గర ఉన్న ఆధారాలు బయటపెడితే ఇద్దరు ఐపీఎస్ ల ఉద్యోగాలు పోతాయన్నారు. కానీ ఆ ఆధారాలు బయటపెట్టదల్చుకోలేదన్నారు.
తనకు నటన చేతకాదని, ఇష్టంలేని చోట ఉండలేనన్నారు. కనీసం తన వివరణ కూడా అడగలేదన్నారు. ఇన్ని రోజులు వైఎస్ అభిమానంతో అవమానాలు భరించానన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తారని ఊహించలేదన్నారు. వైసీపీ నుంచి పోటీచేయదల్చుకోలేదన్నారు. బాలినేని మాటల్ని సీఎం మాటలుగానే భావిస్తున్నానన్నారు. ట్యాపింగ్ పై అధారాలున్నాయన్నారు.