డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే మూడేళ్లపాటు ప్రభుత్వం ఎందుకు దాచిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు ప్రశ్నించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ….జగన్ ప్రభుత్వం తన అసమర్థతతో పోలవరాన్ని బలి చేసిందన్నారు. పోలవరం అథారిటీ, కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టినా.. మూర్ఖంగా ముందుకు వెళ్లి ప్రాజెక్టును నాశనం చేశారని మండిపడ్డారు. డయాఫ్రమ్ వాల్ ఎలా కూలిందో చెప్పకుండా.. మాపై ఆరోపణలు చేయొద్దన్నారు. సీపీఎస్ ఉద్యమంపై ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటోందన్నారు. హక్కుల కోసం పోరాటాలు చేస్తే అరెస్ట్ చేస్తారా ? అని ప్రశ్నించారు. విద్యా సంవత్సరాన్ని జూన్ 12 నుంచి జులై 8కి మార్చడమేంటి ? అని నిలదీశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement