Monday, November 25, 2024

AP | జగన్ తప్పు చేయకపోతే భయమెందుకు.. గోనె ప్రకాష్ రావు

(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగించిన అదానీ ముడుపుల వ్యవహారంలో జగన్ పాత్ర బట్టబయలు అయ్యిందని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు విమర్శించారు. తప్పు నీ వైపు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు బుకాయించడం తగదన్నారు. తల్లిని, చెల్లిని మోసం చేసిన నీకు రాష్ట్రాన్ని, ప్రజలను మోసం చేయడం పెద్ద విషయం కాదన్నారు. సరైన సంఖ్యా బలం లేని నీవు ప్రతిపక్ష హోదా అడగడం సిగ్గుగా అనిపించట్లేదా అని ప్రశ్నించారు.

అదానీ అంశంతో పాటు మరిన్ని అంశాలపై తనతో చర్చించేందుకు రావాలని ఆయన సవాల్ విసిరారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనే ప్రకాశ రావు మాట్లాడుతూ… గౌతమ్ అదానీ, వై.ఎస్.జ‌గ‌న్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అదానీ ఎలా ఎదిగాడో దేశ ప్ర‌జ‌లందరికీ తెలుసన్న అయన అదానీకి వచ్చిన డబ్బుతో అన్నీ రాష్ట్రాల సీఎంలకు కమిషన్ ఇచ్చారని ఆరోపించారు.

అదానీ షేర్ల ద్వారా వచ్చిన డబ్బులో 4 రాష్ట్రాల్లో సీఎంలకు డబ్బు ఇచ్చారని మీడియాలో వస్తోందని, జగన్ కి రూ.1750 కోట్లు ఇచ్చారని మీడియాలో వచ్చాయన్నారు. అమెరికా చట్టం ప్రకారం కచ్చితంగా కేసు నమోదైతే ఆ దేశానికి వెళ్ళాల్సి ఉంటుందని, అదానీ విషయంలో మోడీ జోక్యం చేసుకునే పరిస్థితి లేదన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఎటువంటి తప్పు చేయకుంటే ఎందుకు భయపడుతున్నాడన్నారు. జగన్ కి కూడా ఇబ్బందులు తప్పవన్న అయన అమెరికా చట్టాలు చాలా కఠినంగా ఉంటాయని, శిక్ష అనుభవించక తప్పదన్నారు. ఫెడర‌ల్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్ తో అదానీపై ఇన్వెస్టిగేషన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

ఐ డ్రీమ్ జగన్ జేబు సంస్థ అని ఎన్నికల ముందు తొట్టి గ్యాంగ్ బ్యాచ్ తో ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసి ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెట్టాల‌ని చూశాడన్నారు. జగన్ కు ఏకోణంలో ప్రతిపక్ష హోదా వస్తుందో వైసీపీ చెప్పాలని, భారతదేశంలో 9 రాష్ట్రాల్లో ఎవరికీ ప్రతీపక్ష హోదా లేదన్న విషయాన్ని గుర్తు చేశారు. చ‌దువుకున్న జగన్ ప్ర‌తిప‌క్ష హోదా అడ‌గ‌టానికి సిగ్గు లేదా వుండాలన్నారు. అదానీని మోదీ కూడా వదులుకునే పరిస్థితి వస్తుందని, అమ్మను, చెల్లిని మోసం చేసిన‌ నీచ చరిత్ర జ‌గ‌న్ దన్నారు. విజయ సాయిరెడ్డికి సవాల్ విసిరిన గోనే ద‌మ్ముంటే డిబేట్ కి రావాల‌ని ఛాలెంజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement