Tuesday, November 26, 2024

వైసీపీ నేత‌ల‌కు అంత భ‌య‌మెందుకు ?.. చంద్ర‌బాబు

టీడీపీ, జ‌న‌సేన స‌భ‌లు పెడితే వైసీపీ నేత‌లు భ‌య‌ప‌డుతున్నార‌ని, వైసీపీ నేత‌ల‌కు అంత భ‌య‌మెందుక‌ని మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్ర‌శ్నించారు. చిత్తూరులో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పాలనుకున్నది నిన్న‌ స్పష్టంగా చెప్పారన్నారు. వైసీపీ నేతలు పవన్ ను ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదని తెలిపారు. తప్పు చేస్తూ ఎదురుదాడి ద్వారా కప్పి పుచ్చుకుంటున్నారని విమర్శించారు. అర్హత లేని వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారని పేర్కొన్నారు. కార్యకర్తలను జైల్లో పెట్టి భయపెడితే లొంగిపోరని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా తమ పోరాటం ఆగదని చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారం ఉందన్న అహంకారం అంతమంచిది కాదని వెల్లడించారు. ఏపీలో వైసీపీ తప్ప ఏ రాజకీయ పార్టీ సమావేశాలు నిర్వహించుకోవద్దా అని చంద్ర‌బాబు ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement