Friday, November 22, 2024

Who Will Win – గెలుపు గుర్రాల కోసం టిడిపి, జ‌న‌సేన పార్టీల‌లో స‌ర్వేల జోరు..

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల నేతలు నియోజక వర్గాల్లో తమ బలాబలాలపై ఒక అంచనాకు వచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అన్ని పార్టీలు సర్వేలు నిర్వహి స్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా నియోజక వర్గాల్లో తమ పరిస్థితిపై సొంత సర్వేలు నిర్వహిస్తున్నారు. సొంత టీమ్‌లను ఏర్పాటు చేసి అన్ని వర్గాలను కలుస్తూ నియో జకవర్గాల్లో తమ బలంపై ఒక అంచనాకు వచ్చేందుకు కార్యా చరణను సిద్ధం చేశారు. పార్టీ కార్యక్రమాల నిర్వాహణ నుంచి నేతల పనితీరు పై ప్రజాభిప్రాయం సేకరిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రజలను కలుస్తున్న సర్వే టీమ్‌లు ఆయా నేతల పరిస్థితిని క్షుణ్ణంగా తెలుసుకుంటూ రిపోర్ట్‌లు అందజేస్తు న్నారు. ప్రధానంగా టీడీపీ ప్రకటించిన సూపర్‌ సిక్స్‌, భవిష్య త్‌కు గ్యారెంటీ పథకాలపై జనం నాడిని తెలుసుకుంటున్నారు. ఇదే సమయంలో అధికార పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలు వాటితో లబ్ధిదారుల సంతృప్తి తదితర అంశాలను బేరీజు వేసు కుంటున్నారు. ప్రతినేత నియోజకవర్గ ఇంఛార్జ్‌ టికెట్లను ఆశిస్తు న్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో లక్షలు ఖర్చు చేసి మరీ సొంత సర్వే టీమ్‌లను ఏర్పాటు చేసుకుని నియోజకవర్గంలో పరిస్థితు లను తెలుసుకుంటున్నారు. ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా వరుస సర్వేలు నిర్వహిస్తోంది. ఇంకోవైపు టీడీపీకి చెందిన షో టైమ్‌ కూడా జనంలోకి వెళ్తూ వారి నాడిని పసిగట్టే ప్రయత్నం చేస్తోంది. అధిష్టానానికి ఎప్పటికప్పుడు నియోజకవర్గాల్లో పరిస్థితిని తెలియజేస్తూ అక్కడ తీసుకోవా ల్సిన జాగ్రత్తలు, మార్పులు, చేర్పులను నివేదిస్తోంది.

అలాగే నియోజకవర్గ ఇంఛార్జ్‌ పనితీరును కూడా క్షుణ్ణంగా తెలుసు కుంటూ అధిష్టానానికి రహస్య నివేదికలు ఇస్తోంది. నేతల పనితీరు సరిగా లేని పక్షంలో ఆయా ప్రాంతాల్లో కొన్ని మార్పు లను సైతం షో టైమ్‌ టీమ్‌ సూచిస్తున్న పరిస్థితి ఉంది. పార్టీ కార్యక్రమాల నిర్వాహణ నుంచి కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతల అభిప్రాయ సేకరణ కూడా చేస్తూ రహస్య నివేదికలు తయారు చేస్తోంది. ఒకవైపు టీడీపీ అధినాయకత్వం చేయిస్తు న్న సర్వేలు కొనసాగుతుండగా మరోవైపు నేతల సొంత సర్వేలు జోరుగా సాగుతున్నాయి. ఈ రెండు సర్వేల్లో అనేక అంశాలు స్పష్టమవుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా అధినాయకత్వం కార్యాచరణను మొదలు పెట్టింది. ఇక ఇదే సమయంలో ఊరు, పేరు లేని కొన్ని సంస్థలు, చిన్న చిన్న యూ ట్యూబ్‌ ఛానళ్లు సర్వేల పేరిట కొంత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. డబ్బు చెల్లించేవారికి అనుకూలంగా ఈ సర్వే ఫలితాలను వెల్లడిస్తూ అయోమయానికి గురి చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.

సర్వేల్లో మహిళలకు ప్రాధాన్యత..
ఇదిలా ఉంటే టీడీపీ అధినాయకత్వం నుంచి నేతల వరకు చేస్తున్న సర్వేల్లో మహిళలకు అగ్ర ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రధానంగా పార్టీ ప్రకటించిన మినీ మేనిఫెస్టో అంశాలపై జనం నాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోవైపు అభివృద్ధి, యువతలో ఉన్న అభిప్రాయాలను స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో నియోజకవ ర్గాల్లో పరిస్థితుల్లో కొన్ని మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జనసేనతో పొత్తుపై అధికారిక ప్రకటన వెలువడ టం, చంద్రబాబు అరెస్ట్‌ పరిణామాలు తెలుగుదేశం శ్రేణుల్లో కొత్త జోష్‌ను నింపుతున్నాయి. ఒకవైపు సానుభూతితో పాటు మరోవైపు జనసేన పొత్తు కలిసి వస్తుందన్న ధృడ అభిప్రాయం లో కేడర్‌, నేతలు ఉన్నారు. ఇదే సమయంలో పార్లమెంట్‌ పరిధిలో పోటీ చేసే అభ్యర్థులు కూడా తమవంతు ప్రయత్నాల ను మొదలుపెట్టారు. ఇప్పటివరకు అధికారికంగా టీడీపీ తరపున ఎవరికి టికెట్‌లు ఇవ్వకపోయినా రోజురోజుకీ అశావ హుల సంఖ్య మాత్రం భారీగా పెరుగుతోంది. వీరిలో కొందరు సొంత సర్వేలు చేసి ఆ నివేదికల ద్వారా అధిష్టానం దృష్టిలో పడేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement