Monday, November 18, 2024

AP Assembly: నేడు శాంతిభ‌ద్ర‌త‌ల‌పై శ్వేత‌ప‌త్రం…

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – అమ‌రావ‌తి – ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటికి నాలుగో రోజుకి చేరుకున్నాయి.. గత 5ఏళ్ల పాలనలో రాష్ట్రంలో అదుపుతప్పిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కాగా, నేడు స‌భ ప్రారంభ‌మైన వెంట‌నే ఇక ఇటీవల చనిపోయిన మాజీ శాసనసభ్యులు పెండ్యాల వెంకట కృష్ణారావు, యెర్నేని సీతాదేవి, అనిశెట్టి బుల్లబ్బాయ్ రెడ్డి, సద్దపల్లి వెంకటరెడ్డిలకు శాసనసభ సంతాపం ప్రకటించింది.

అనంతరం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది..
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ, ప్రత్యేక అవసరాల విద్యార్థుల పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం, సంఘ విద్రోహశక్తుల నియంత్రణ, విశాఖపట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సౌకర్యాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులపై ప్రశ్నల‌కు మంత్రులు సమాధానాలు ఇవ్వ‌నున్నారు.

ప్ర‌శ్న నెంబ‌ర్ 2
ఎస్సీ ఎస్టీల సంక్షేమ పథకాల రద్దు, రాష్ట్రంలో టిడ్కో గృహాలు, సుప్రీంకోర్టులో కేసులు, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కేసీ కెనాల్ మళ్లింపు, బదిలీ చేయదగిన అభివృద్ధి హక్కులపై ప్రశ్నలు..మంత్రులు సమాధానం

- Advertisement -

శాసనమండలిలో నేడు…

శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు…
ప్రైవేటు ఏజన్సీలకు మోనజైట్ సిలికాన్‌ల అనధికార విక్రయం, రాష్ట్రంలో ఇ -వ్యర్థాల తొలగింపు, 2023 – 2024 మధ్యకాలంలో ధాన్యం సేకరణ, నిత్యావసరాల ధరల పెరుగుదల, పంటల భీమా బకాయిల చెల్లింపుపై ప్రశ్నల‌కు మంత్రులు సమాధానం ఇస్తారు.

ప్ర‌శ్న 2
రైతులకు పెట్టుబడి సాయం, మంగంపేట బెరైటీస్ గనులలో అక్రమాలు, రాష్ట్రంలో నూతన విద్య కళాశాలలు, పులివెందుల గృహనిర్మాణ ప్రాజెక్టులో అనర్హులైన లబ్ధిదారులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రశ్నల‌కు మంత్రులు సమాధానం ఇవ్వ‌నున్నారు.

ఇక శాసనమండలిలో గత 5ఏళ్ల పాలనలో అదుపుతప్పిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం హోంమంత్రి వంగలపూడి అనిత విడుదల చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement