అమరావతి, (ప్రభ న్యూస్): పసిడి ధరలు పరుగుపెట్టినట్లు పత్తి ధరలు కూడా పైపైకి దూసుకుపోతూండటంతో పత్తిరైతు ఆనందానికి హద్దు లేకుండా పోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పత్తి ధర పలుకుతోంది. పత్తిని తెల్లబంగారంగా పిలుచుకుంటున్న రైతు ఈసారి ఆర్థికంగా కోలుకున్నట్టే. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం తగ్గడంతోపాటు అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో పత్తి.. తెల్ల బంగారమే అయింది. సీసీఐ కొనుగోలు కేంద్రాల కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కంటే రైతుకు ఎక్కువే లభిస్తోంది. ప్రస్తుతం పత్తి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.6,025 ఉండగా, మార్కెట్‌లో రూ.8,500 పలుకుతోంది. ఈ ఏడాది రూ.10వేల మార్కును చేరుకోవచ్చని అంచనా. ధరల పెరుగుదలతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు బహిరంగ మార్కెట్ ధరతో పోల్చితే సీసీఐ మద్దతు ధర తక్కువగా ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement