దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కూడా మాస్క్ వాడకాన్ని కంపల్సరీ చేశాయి. లేకుంటే వెయ్యి రూపాయల ఫైన్ విధించాలని పోలీసులకు ఆదేశాలు కూడా జారీ చేశాయి. కాగా, మార్కెట్ లో దొరికే చీఫ్ క్వాలిటీ మాస్కులు మహమ్మారిని ఎదుర్కొనేందుకు అంతగా ఎఫెక్టివ్‌గా ఉండకపోవచ్చు.. అయితే ఏ మాస్క్ ఎవరికి అనుకూలంగా ఉంటుంది? ఏది ఎక్కువ ఇంపాక్ట్ చూపుతుందో చదివి తెలుసుకుందాం.
మాస్క్‌ల్లో రకాలు..
సుమారుగా మాస్క్‌లు 3 రకాల ఉన్నాయి. సర్జికల్ మాస్క్‌లు, ఎన్-95 మాస్క్‌లు.. ఫాబ్రిక్ లేదా క్లాత్‌తో చేసిన మాస్క్‌లు. కరోనా వైరస్ వంటి ఇన్ఫెక్షన్‌ను నివారించడానికి ఎన్95 మాస్క్‌ని ఉత్తమ మాస్క్‌గా పరిగణిస్తారు. ముక్కు లేదా నోటిలోకి ప్రవేశించకుండా సున్నితమైన కణాలను కూడా నిరోధిస్తుంది. ఇది గాలిలో ఉండే 95 శాతం కణాలను నిరోధించగలదు. అందుకే దీనికి ఎన్-95 అని పేరు వచ్చింది. అదే సమయంలో, సాధారణ సర్జికల్ మాస్క్‌లు కూడా 89.5 శాతం కణాలను నిరోధించగలవు. ఈ రెండు మాస్క్‌లు ధరించాలని నిపుణులు సూచిస్తారు. ఇవి కాకుండా మార్కెట్‌లో క్లాత్ మాస్క్‌లు కూడా కనిపిస్తాయి.
కొనడానికి మంచి మాస్క్ ఏది..?
లేయర్: మాస్క్‌ను కొనుగోలు చేసేటప్పుడు , అందులోని లేయర్‌ను ఖచ్చితంగా చెక్ చేయండి. 2 లేదా 3 లేయర్‌లతో తయారు చేసిన మాస్క్‌ను మాత్రమే కొనుగోలు చేయండి. సింగిల్ లేయర్ మాస్క్ కంటే 2 లేదా 3 లేయర్ మాస్క్ ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనంలో వెల్లడైంది.
ఫిల్టర్‌లతో మాస్క్‌లు..
ఫిల్టర్‌లు క్లాత్ మాస్క్‌తోనే వస్తాయి. ఈ మాస్క్‌లు సాధారణ మాస్క్‌ల కంటే మెరుగ్గా ఉంటాయి. జాగ్రత్తలు.. మాస్క్ ధరించే ముందు, తొలగించిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి. మాస్క్ ముక్కు, నోరు.. గడ్డాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా చూసుకోవాలి.
క్లాత్ మాస్క్ మంచిదేనా..?
కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పెద్ద ఏరోసోల్‌లను నిరోధించడంలో క్లాత్ మాస్క్‌లు ప్రభావవంతంగా ఉంటాయి. అయితే, మీరు చిన్న ఏరోసోల్‌లను నివారించడానికి సర్జికల్ లేదా ఎన్-95 మాస్క్‌ని ఉపయోగించాలి. ముఖంపై సరిపోనిది, వదులుగా లేదా గట్టిగా ఉండేవి ధరించవద్దు. శ్వాస తీసుకోవడం కష్టమయ్యేలా ఉండే మాస్క్ వాడొద్దు. ఒకే పొరను కలిగి ఉన్న మాస్క్ ఉపయోగించవద్దు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital