అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో అవినీతి నిరోధానికి, అక్రమార్కులపై ఫిర్యాదులు చేసేందుకు ఇటీవల ప్రభుత్వం ప్రారంభించిన ‘ఏసీబీ 14400’ యాప్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనదైన శైలిలో విమర్శలు చేశారు. అధికార పార్టీ నేతలు చేస్తున్న అవినీతిపై ఎవరికి ఫిర్యాదు చేయాలంటూ వ్యంగంగా ప్రశ్నించారు. ‘ఏసీబీ 14400′ యాప్‌నకు సంబంధించిన వార్తను ట్యాగ్ చేస్తూ మరి వైసీపీ పాలకుల అవినీతి గురించి, వారి ఎమ్మెల్యేల దోపిడీ, దౌర్జన్యాల మీద ఫిర్యాదు చేయాలంటే ప్రజలు ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి?’ అని టీ-్వట్‌లో ప్రశ్నించారు.
అసలైన వ్యవస్థ అంటే ‘తప్పు చేసిన వారిని శిక్షించాలే తప్ప అక్కున చేర్చుకోకూడదు’ అనే అర్థం వచ్చేలా ఇంగ్లాండ్‌కు చెందిన ప్రసిద్ధ పోలీసు అధికారి సర్ రాబర్ట్ మార్క్ కొటేషన్ ‘వన్ దట్ క్యాచెస్ మోర్ క్రూక్స్ దేన్ ఇట్ ఎంప్లాయ్స్’ ను ఉటంకిస్తూ మరో ట్వీట్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.