అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అపురూప చారిత్రాత్మక కట్టడాలు అనేకం ఉన్నా.. యునెస్కో గుర్తింపు జాబితాలో చోటు చేసుకోవడానికి నోచుకోలేదు. దేశంలోని గొప్ప చరిత్రాత్మక విశేషాలకు ఆంధ్రప్రదేశ్ నిలయం. అయితే ఏపీలో ఇప్పటివరకు తొలి చారిత్రాత్మక కట్టడం వీరభద్రస్వామి ఆలయం, లేపాక్షి యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కాయి. మిగతా కట్టడాలకు కూడా యునెస్కోలో చోటు కల్పించాలని గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం కల్పించలేదు.
రాష్ట్రంలో ప్రధానంగా వరల్డ్ హెరిటేజ్ సెక్షన్‌కు సాలిహుండం, శంకరం, గుంటుపల్లి గుహలు, గండికోటలను సిఫార్సు చేయడం జరిగింది. రానున్న 2023లో యునెస్కో తాత్కాలిక జాబితాలో పై కట్టడాలకు చోటు దక్కితే 2025లోపు పూర్తిస్థాయి యునెస్కో గుర్తింపు దక్కే అవకాశం ఉంది. వీటిని యునెస్కో గుర్తించడం వల్ల పర్యాట కంగా, చారిత్రా త్మకంగా ఏపీకి ప్రపం చ వ్యాప్త గుర్తింపుతో పాటు ఆదాయం లభించ నుంది. ఈ కట్టడాలకు యునెస్కోలో చోటు కల్పించాలని అభిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజేయులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..