Friday, November 8, 2024

క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశాలు ఎప్పుడు..?

అమరావతి, (ప్ర‌భ‌న్యూస్) :రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ కన్వీనర్‌ కోటా సీట్ల కేటాయింపులో జరుగుతున్న ఆలస్యం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో టెన్షన్‌ పెంచుతోంది. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ పూర్తయినా కన్వీనర్‌ కోటా సీట్ల విషయంలో జాప్యం జరుగుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పొరుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం సెట్స్‌ (ఉమ్మడి ప్రవేశ పరీక్ష) రాసిన విద్యార్థులు ఎక్కడ చేరాలో అర్థం కాక గందరగోళానికి గురవుతున్నారు. ఈఏపీ సెట్‌లో ర్యాంకు రాని విద్యార్థుల్లో కొంత మంది తెలంగాణ ఎంసెట్‌లో అర్హత సాధించారు. దీంతో ఆ రాష్ట్రంలో కౌన్సెలింగ్‌ కోసం ఫీజు చెల్లించారు. మరోవైపు మన రాష్ట్రంలో కన్వీనర్‌ కోటాలో సీటు వస్తుందేమోనన్న యోచనలో పొరుగు రాష్ట్రంలో సీట్‌ ఆప్షన్‌ను హోల్డ్‌లో ఉంచుకున్నారు.

ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో సీట్ల కేటాయింపులో జాప్యం జరగడంతో ఏం చేయాలో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పక్క రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కళాశాలలో చేరితే ఒరిజినల్‌ సర్టిపికెట్లన్నీ అక్కడ సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏపీలో సీటు లభించినా సర్టిఫికెట్లు వెనక్కు తీసుకోవడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఒక విద్యా సంవత్సరం వృథా అయ్యే ప్రమాదం ఉంది. దీంతో ఏపీలో సీట్ల కేటాయింపు వరకు ఎదురు చూడాలా లేక, పొరుగు రాష్ట్ర విద్యాసంస్థల్లో చేరాలా అనే అంశంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తర్జనభర్జన పడుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement